| Daily భారత్
Logo




రోడ్డు ప్రమాదం.. వైద్య విద్యార్థిని మృతి

News

Posted on 2025-12-15 14:37:20

Share: Share


రోడ్డు ప్రమాదం.. వైద్య విద్యార్థిని మృతి

హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. వైద్య విద్యార్థిని మృతి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి:తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతిచెందారు. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. యంసాయని ఐశ్వర్య మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నది.  సోమవారం ( ఈరోజే ) ఉదయం తన తండ్రి పాండుతో కలిసి హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఐశ్వర్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆమె తండ్రిని మరో దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >