Posted on 2025-12-15 17:57:58
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తా
అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 35 ఏళ్ల పాటు వివిధ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు అంటే తనకు ఎనలేని గౌరవమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర, వారి పట్ల వారికి కేంద్రంలో తమ ఎంపీ తో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన వారికి భరోసా కల్పించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో 35 ఏళ్ల పాటు పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రభుత్వాల పరంగానే కాకుండా తనవంతుగా తన ట్రస్టు ద్వారా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల కొరకు సాయం అందిస్తానని ప్రకటించారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనం ప్రస్తుతం ఇరుకుగా ఉందని రిటైర్డ్ ఉద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చారని దాన్ని పరిష్కరించేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విశాలమైన స్థల సేకరణతో పాటు నూతన భవనం నిర్మాణం కొరకు కూడా తాను కృషి చేస్తానని అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఐక్యంగా ఉండి తమకు ప్రభుత్వాలపరంగా రావాల్సిన హక్కుల కోసం ఇలా ఒక భవనాన్ని నిర్మించుకొని కలిసికట్టుగా ఉండడం అభినందనీయమన్నారు. మూడు రోజులపాటు క్యారం, చెస్, షటిల్ లాంటి క్రీడలు ఆడడానికి ముందుకు రావడం వారిలో ఉన్న ఐక్యతకు నిదర్శనమని అన్నారు. అలాగే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తన కుమారుడి హాస్పిటల్ సన్రైజ్ హాస్పిటల్ కు వెళ్తే నాణ్యమైన మెరుగైన చికిత్స అందిస్తామని ఆయన అన్నారు. ఇంకా ఏ సమస్య వారికి కావాలన్నా తన ఇంటి తలుపు తట్టి తనకు కలవచ్చని ఆ సమస్యలు ఎంతటివైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లయ్య గారి పండరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చబోయిడి గంగ కిషన్, కోశాధికారి రవీందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు భోజా గౌడ్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >