Posted on 2025-12-20 20:11:45
అంత్యక్రియల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఏడవ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బీజేపీ సీనియర్ నాయకుడు బట్టిగిరి ఆనంద్ (45) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన మరణించిన వార్త వినగానే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హుటాహుటిన తన ఇంటికి వెళ్లి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టిగిరి ఆనంద్ తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పుడు హిందూ ధర్మం కోసం బిజెపి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ బిజెపి పార్టీకి ఒక సైనికుడిలా ఆయన పనిచేశారని ఆయన మరణించారని వార్త నమ్మలేకపోతున్నాను అని ఆయన పార్టీని తన కుటుంబ సభ్యులను అకస్మాత్తుగా వదిలి మరణించినప్పటికీ ఆయన జ్ఞాపకాలు అయన పార్టీ కోసం చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోనని ఆయన అన్నారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకుంటానని ఎమ్మెల్యే ఆనంద్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆనంద్ పవిత్ర ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు. మరోవైపు సీనియర్ నేతైన ఆయన మృతి పట్ల బిజెపి శ్రేణుల్లో ఆయన కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణ ప్రాంతంలోని 7వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ నాయకుడి ఆకస్మిక మృతితో పార్టీలో విషాదఛాయలు నెలకొన్నాయి. అర్బన్ ఎమ్మెల్యేతో పాటు ఆనంద్ పార్దివ దేహానికి బిజెపి పార్టీ సీనియర్ నేతలు, పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలా ఉండగా సాయంత్రం జరిగిన ఆనంద్ అంత్యక్రియాల్లో అర్బన్ ఎమ్మెల్యే హాజరయ్యారు. అంతేకాకుండా తన అనుచరుడు కావడంతో ఎమ్మెల్యే ఆనంద్ పాడే ను మోసి అందరి అభిమానాన్ని చాటుకున్నారు
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >