Posted on 2025-12-22 17:58:56
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంసందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది సర్పంచ్ ల పంచాయతీలు చంద్రాలగూడెం, రేగుల గూడెం, బంజారా, మల్లారం, లక్ష్మీదేవిపల్లి, ఉల్వనూరు, కిన్నెరసాని, పాత సూరారం, కొత్త సూరారం, పాండురంగాపురం తండా, తవిశలగూడెం లలో కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు పర్యటించి, ప్రమాణ స్వీకరణ ఉత్సవాలలో పాల్గొన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను బొకే, శాలువాలతో సన్మానించి, అభినందించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ నూతన పాలకవర్గాలు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, పంచాయతీని అభివృద్ధి పరచాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ కే సాధ్యం అన్నారు. నూతన పాలకవర్గాలు నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని కొత్వాల కోరారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బరిపటి వాసుదేవరావు, మాజీ జెడ్పిటిసియర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న గౌడ్, కాంగ్రెస్ నాయకులు యర్రంశెట్టి మధుసూదన్ రావు, వుండేటి శాంతివర్ధన్, Y వెంకటేశ్వర్లు (YV), అలెక్స్, బరిపటి ఆనంద్, ముగిస్తే ముసలయ్య, వాసం మంగయ్య, కట్టా సోమయ్య, మాజీ ఎంపీపీ నారాయణ, నరసింహారావు, నీరుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >