Posted on 2025-12-22 20:02:25
హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్ పల్లి మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో నూతన సర్పంచ్‌గా గొట్టిపాటి వాసుబాబు, ఉపసర్పంచ్‌గా సల్మాన్‌తో పాటు 12 మంది వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ధర్మారం (బి)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1079 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. మహిళలు, యువత, విద్యావంతులు కాంగ్రెస్ ప్రభుత్వ సుపరిపాలన పట్ల నమ్మకం ఉంచి విజయాన్ని అందించారని చెప్పారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం పావుల వడ్డీపై రుణాలు అందుబాటులోకి తెచ్చి వారికి ఆర్థిక బలాన్నందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, ప ఎ సి ఎస్ డైరెక్టర్ రామకృష్ణ, నూతన పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >