Posted on 2026-01-04 18:17:00
కొత్త కలెక్టర్ తో నైనా సర్కార్ దవఖాన గాడిలో పడేనా..?
నాణ్యమైన వైద్యం కోసం పేద రోగులు ఎదురుచూపులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అస్తవ్యస్తంగా తయారైన కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా ప్రభుత్వ దవఖానాలో ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం మూలంగా పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్ష గానే మిగిలింది. అయితే ఇటీవల జిల్లాకు బదిలీపై నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పై జిల్లా వాసులు ముఖ్యంగా వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు ఆమెపై తను తను తీసుకునే నిర్ణయాలపై గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నూతన కలెక్టర్ ప్రభుత్వ అధికారులు వారి వారి శాఖల్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా గతంలో నల్గొండ జిల్లాలో పనిచేసిన కలెక్టర్ విధుల్లో ఎవరికి తలోగ్గకుండా, ముఖ్యంగా రికమండేషన్లకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ ఫలాలు అర్హులకు అందివ్వాలని ఆమె పనిచేస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు అందక పేద ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు గత 11 నెలల క్రితం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా విధులు నిర్వహించిన డాక్టర్ ప్రతిమ రాజ్ వివిధ కారణాల నేపథ్యంలో ఆమె సస్పెండ్ కు గురైన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి జిల్లా ఆసుపత్రి లో సూపరిండెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్న పీ శ్రీనివాస్ ఇన్చార్జ్ బాధ్యతలుగానే నిర్వహిస్తున్నారు. కానీ అధికారికంగా జిల్లా సూపరిండెంట్ గా ఇప్పటివరకు ఎవరు నియామకం కాకపోవడం విశేషం. ఎందుకంటే ఇందులో డాక్టర్లు ప్రొఫెసర్లు తాము చెప్పిందే చేయాలి తాము చేసినట్లే చూడాలి అనే వింత పోకడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. హైదరాబాద్లో నిమ్స్ వరంగల్ లో రిమ్స్ తర్వాత మూడోస్థాయిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు ప్రతిరోజు వేల సంఖ్యలో ఓపి రోగులు వస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ దవఖానాలో అన్ని రకాల కు సంబంధించిన వైద్యులు అందుబాటులో లేకపోగా ఉన్న కొద్ది ప్రొఫెసర్లు వైద్యులు తమ ప్రైవేట్ పెట్టినంత శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రి పై పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అయితే గతంలో ఏడంతస్తుల ఈ మేడాలో ప్రారంభంలో కార్పొరేట్ ఆసుపత్రికి దిటుగా చక్కగా నిర్మించారు. కానీ ఇక్కడ పనిచేసిన సూపరిండెంట్లు ఇతర అధికారుల నిర్లక్ష్యం మూలంగా కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ దవఖాన ప్రస్తుతం దౌఖానా లోపల పెచ్చులూడి బూతు బంగ్లా గా మార్చారు ప్రభుత్వ దవాఖాన అధికారులు ఆసుపత్రికి వచ్చిన రోగులు వారి వైద్యం సంగతి దేవుడికి ఎరువు కానీ కొత్త రోగాలు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఏడంతస్తుల లో ఉన్న ఏ దవఖానాలో తొలుత లిఫ్టులు ఇతర అత్యాధునిక వసతులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని అప్పటి ప్రభుత్వం అప్పటి జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి చొరవతో సర్వంగా సిద్ధంగా ముస్తాబు చేశారు. అయితే కాలక్రమేనా ప్రభుత్వాలు మారినప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కోట్లు వెచ్చించి జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్, క్యాథల్యాబ్ ఏర్పాటు చేశారు కానీ అవి ఎప్పుడు పని చేస్తావో ఎప్పుడు పని చేయవు తెలియని పరిస్థితి. ఇక గుండెకు సంబంధించిన వైద్యునికి గత సుపరిండెంట్ హయాంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి వైద్యుడిని తీసుకొచ్చారే కానీ అది కాస్త మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. అయితే ఈ ఆసుపత్రిలో అన్ని రకాల కు చెందిన డాక్టర్లు, ప్రొఫెసర్లు వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎక్కడికి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. నెలలో ఒక్కసారైనా జిల్లా కలెక్టర్ గా, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి చైర్ పర్సన్ గా ఉండే కలెక్టర్ జిల్లా ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప పేదవారికి మెరుగైన వైద్యం దక్కదనంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే 2025 8వ నెల లో జిల్లా ఆసుపత్రి మరమ్మత్తులకై అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రెండు కోట్ల 76 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులు సంబంధిత శాఖావారు ఆన్లైన్ ద్వారా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పజెప్పిన నేటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమాత్రం మరమ్మత్తుల పనులు జరగకపోవడం కొసమెరుపు.
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >