Posted on 2026-01-12 17:38:48
రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష పార్టీల డిమాండ్
డైలీ భారత్, వైరా:వైరాలో గల మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని బోనకల్‌కు తరలించడానికి ప్రభుత్వం పూనుకోవడం సరైన చర్య కాదని, ఎంవిఐ కార్యాలయాన్ని వైరాలోనే కొనసాగించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. సోమవారం వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి చంతనిప్పు చలపతిరావు అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, బీఆర్‌ఎస్ మండల కార్యదర్శి బాణాల వెంకటేశ్వర్లు, వైరా టౌన్ అధ్యక్షులు మద్దెల రవి, టీడీపీ నాయకులు సురేందర్, మోత్కూరు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ
వైరా, తల్లాడ, కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలకు కేంద్రంగా ఉన్న జంక్షన్ వైరా పట్టణమని, అలాంటి వైరాలోనే మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉండటం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు అన్నారు. రైతులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ కోసం, డ్రైవింగ్ లైసెన్స్ పనుల కోసం బోనకల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న వైరాలోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధిర ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క బోనకల్‌లో అవసరమైతే నూతనంగా సబ్ రిజిష్టేషన్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని, కానీ వైరాలో ఉన్న కార్యాలయాన్ని మాత్రం తరలించకూడదని సూచించారు. వైరాలోని మోటార్ వెహికల్ కార్యాలయాన్ని తరలించే ప్రయత్నం చేస్తే ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని అన్ని మండలాల ప్రజలను సమీకరించి ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) పార్టి జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు నాయకులు తోట నాగేశ్వరరావు, షేక్ నాగుల్ పాషా, కొంగర సుధాకర్, టీఆర్‌ఎస్ నాయకులు లాల్ మహమ్మద్, టీడీపీ నాయకులు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మనుబోలు వెంకటకృష్ణ, ఏదునూరు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >