Posted on 2026-01-22 10:00:02
శివనాడార్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దివ్య కన్నన్
డైలీ భారత్ డెస్క్: భారత దేశంలో పత్రికలను చూస్తే తరచుగా పాఠశాల పిల్లల మరణాల గురించి వార్తలు కనిపిస్తాయి అని శివనాడార్ యూనివర్శిటీ చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దివ్య కన్నన్ అన్నారు. కూలిపోయిన తరగతి గదుల పైకప్పులు, మద్యం తాగిన బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు లేదా ఇతర సిబ్బంది చేత లైంగిక వేధింపులు, తరగతి గదుల్లో ఏడిపించ డాలు వంటివి అరుదైన సంఘటనలు కావు, ఆందోళన కలిగించేంతగా తరుచుగా జరుగు తున్నవే! పేద, కార్మిక వర్గాలకు చెందిన పిల్లలు, చారిత్రకంగా అణగారిన సమూహాల పిల్లలు చదివే పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు అధికంగా జరగడం కూడా యాదృచ్ఛికం కాదు. పత్రికల్లో ఇవి "సాధారణ" వార్తల్లా రాయబడు తున్నప్పటికీ, వాస్తవానికి ఇవి రాజకీయ నిర్ణయాల ఫలితాలు! భారతదేశంలో కూడా, ఇతర దేశాల్లోలాగే, విద్య అనేది కేవలం నేర్చుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చదువు ఎవరికి లభిస్తుంది? వారికి ఏమి నేర్పి స్తున్నారు? భవిష్యత్తులో వారిని ఏ దిశగా నడిపిస్తారు? ఇవన్నీ సామాజిక-ఆర్ధిక అస మానతలతో ముడిపడిన ప్రశ్నలే. బ్రిటిష్ వలస పాలన రోజుల నుంచి ఇప్పటి వరకూ పాఠశాలలు ఈ లోతైన అసమానతలను ప్రతిబింబిస్తూ, తరచుగా వాటిని మరింత బలపేతం చేస్తూ వచ్చాయి. "మన దేశంలో సాధారణ విద్య చాలా కాలంగా విభిన్న అవసరాలను నెరవేర్చింది. బ్రిటిష్ పాలనా కాలంలో, విద్యను వారి ఆధునీ కరణ మిషన్లో కీలక భాగంగా భావించారు. అప్పట్లో పాలనకు, సామాజిక నియంత్రణకు, ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే సాధనంగా విద్య రూపొందింది. 1835లో గవర్నర్ జనరల్ కౌన్సిల్ లా మెంబర్ అయిన థామస్ మెకాలే తను రాసిన ప్రసిద్ధి చెందిన "మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్" లో... విద్య లక్ష్యం "రక్తం, వర్ణంలో భారతీయులైనా, అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, నైతిక విలువల్లో, మేధస్సులో ఇంగ్లీషువారిలా ఉండే ప్రజలను సృష్టించడం కావాలి" అని ప్రకటించాడు. ఈ దృష్టితోనే విద్యా వ్యవస్థను రూపొందించారు. దీనిలో విద్య అందుబాటు, నాణ్యత, అవకాశాలన్నీ అసమాన తలతో కూడుకున్నవే.
ఈ వ్యవస్థను రూపొందించడంలో ప్రభు త్వాధికారులు, క్రైస్తవ మిషనరీలు, మతపరమైన, కులాధారిత సంస్కరణ వాదులు, సంఘాలు తమ పాత్ర పోషించాయి. భారతీయ ఉన్నత వర్గాలు, పెరుగుతున్న మధ్య తరగతి పిల్లలకు సక్రమంగా నిర్వహించే ఇంగ్లీష్-మీడియం, ఆంగ్లో-వెర్నాక్యులర్ సంస్థలు అందుబాటులో ఉండగా, జనాభాలో మెజారిటీ ప్రజలకు మాత్రం ప్రాథమిక స్థాయి, తక్కువ సదుపాయా లతో నడిచే స్థానిక భాషా పాఠశాలలే దిక్కుగా మారాయి.
1854 నాటికి, చార్ల్స్ వుడ్ రూపొం దించిన "డిస్పాచ్ ప్రణాళిక" ఈ విద్యా విస్తరణ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లింది. దీని ద్వారా ప్రైవేట్ సంస్థలు నడిపే స్థానిక భాషా పాఠశాలలను ప్రోత్సహించినప్పటికీ, అవి వలస ప్రభుత్వానికి గట్టిగా లోబడి ఉండేలా నియంత్రణలు రూపొందించారు. ఈ పాఠశా లల్లో చాలా వరకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ విధానం ద్వారా అందే గుర్తింపు, నిధులపై ఆధారపడే పరిస్థితిలో ఉన్నాయి. అయితే, పై నుండి ఉన్న ఈ తరహా జోక్యాలు విజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడం, పాఠశాలలను అందరి కీ అందుబాటులో ఉంచడం వంటి లక్ష్యాలను పెట్టుకోలేదు. దానికి భిన్నంగా అప్పటికే ఉన్న కులం, వర్గం, ప్రాంతం, లింగం, భాష వంటి అసమానతలకు అనుగుణంగా విద్యను అందు బాటులోకి వచ్చేలా రూపొందించారు. 1882 లో భారత విద్యా సంఘం నివేదిక వెలువడిన తర్వాత విద్యా సదుపాయాలు, మౌలిక వసతులు పెరగడం ప్రారంభమయ్యాయి. ఆ నివేదిక స్థానిక భాషా పాఠశాలలను విస్తరించాలని సిఫారసు చేసింది. ఇది భారతీయ ఉపాధ్యాయులు, సంస్కరణవాదులకు తమ విద్యా దృష్టి కోణాలను వ్యక్తీకరించడానికి కొంత అవకాశాన్ని కల్పించింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత, 1947లో, భారతదేశ జాతి నిర్మాణ ప్రాజెక్టులో విద్య ప్రధాన స్థానం పొందినప్పుడు పాఠశాల పిల్లలను నైతిక, శారీరక, సాంస్కృతిక సంస్క రణల లక్ష్యాలుగా గుర్తించారు. అలా ఓ కొత్త, పేద దేశానికి జీవం పోసేందుకు ఇవి అవసర మైన వాటిగా భావించారు. శాస్త్ర- సాంకేతిక రంగాల్లో పెట్టుబడులతో పాటు విద్యను విస్తరించడంపై దృష్టి పెట్టారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా, జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. 1968 - 1986ల మధ్య ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, బాలి కలు, గిరిజనులకు చెందిన పిల్లల కోసం విద్యా సౌకర్యాలను మెరుగుపరచడం వంటి అంశాలకు ఈ విధానంలో భాగంగా ప్రాధాన్యత లభించిం మరికొన్ని రాష్ట్రాలు చాలా వెనుకబడ్డాయి. ఈ అంతరాల్లో చిక్కుకున్నది పేద పిల్లలే! ది. ఇవే లక్ష్యాలతో పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం, బాల్య వివాహాలను నిషేధించడం, ప్రమాదకరమైన పనుల నుండి పిల్లలను రక్షించే చట్టాలను అమలు చేసే ప్రయత్నాలు కూడా విద్యకు అనుసంధానించారు. అయితే, అమలు మాత్రం అస్తవ్యస్తంగా సాగిం ది. కొన్ని రాష్ట్రాలు ముందుకు దూసుకెళ్లగా, మరికొన్ని రాష్ట్రాలు చాలా వెనుకబడ్డాయి ఈ అంతరాల్లో చిక్కుకున్నది పేద పిల్లలే.
నూతన విద్యా విధానం_ పరిమితులు
ఈ సమస్యలు కొనసాగుతుండగానే కోవిడ్ మహమ్మారి విరుచుకుపడింది. అది ఉదృతంగా వ్యాపిస్తున్న సమయంలోనే నూతన విద్యావిధానం-2020ని ప్రకటించారు. కోవిడ్ కారణంగా నెలకొన్న పరిస్థి తులు బోధన విధానాలపైనా, విద్యా వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సవాళ్లను నూతన విద్యా విధాన పత్రంలో ఎక్కడా ప్రస్తావించ కపోవడం ఆందోళన కలిగించే విషయం. స్వాతంత్ర్యం తరువాత తొలి దశాబ్దాల్లో ప్రభు త్వ పాఠశాలలు గౌరవనీయమైన సంస్థలుగా గుర్తింపుపొందాయి. నేటి భారత మధ్యతరగతికి చెందిన అనేక మంది నిపుణులు, బ్యూరో క్రాట్లు, ఉపాధ్యాయులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే. కానీ 1980ల తరువాత ప్రారంభమైన నూతన ఆర్థిక సంస్కర ణలు ప్రభుత్వ రంగం విఫలమైందన్న వాదన ను బలంగా ముందుకు తీసుకువచ్చాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులపై సోమరులు, అసమర్థులన్న ముద్రను వేశాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పాఠశాల లను విడిచి, ప్రైవేట్ పాఠశాలలవైపు మళ్లడం ప్రారంభించాయి. క్రమంగా ప్రభుత్వ పాఠశాలలు పేదవారికే పరిమితమయ్యాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం తగ్గిపో యింది.
2020లో తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ప్రైవేట్ రంగం మరింతగా పెరగడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించింది. పాఠశాలలను ఫ్యాక్టరీల్లా నడపడం ప్రారంభమైంది. ఫలితంగా పిల్లలు స్వంత భాషా -సాంస్కృతిక వారసత్వాల నుండి దూరం అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో, ఎలైట్ ప్రైవేట్, అంతర్జాతీయ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఒకరకమైన గందరగోళం నెలకొంటోంది. వీరికి ప్రపంచవ్యాప్తంగా సంచరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ స్థానికంగా ఎటువంటి సంబంధాలు లేని పరిస్థితి ఉంటోంది. మెరుగైన విద్య, ఉపాధి అవకాశాల కోసం యువత దేశాన్ని విడిచి వెళ్తుండటంతో "మేథో వలస" (బ్రెయిన్ డ్రైయిన్) పెరుగుతోంది. మరోవైపు నూతన విద్యావిధానం కార్పొరేట్ సంస్థలను విద్యారం గంలోకి ఆహ్వానిస్తుంది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పిపిపి) వంటి పదాలను వినియో గించడం ద్వారా ప్రభుత్వ బాధ్యతను తగ్గిస్తోంది. ఫెంచ్ సామాజిక శాస్త్రవేత్త పియెర్ బోర్డ్యూ చెప్పినట్లు, పాఠశాలలు తరచుగా విద్యను ఒక నైపుణ్యంగా మార్చి సామాజిక ప్రత్యేక హొదాను. అసమానతలను పునరుత్పత్తి చేస్తాయి. వివిధ నేపథ్యాల పిల్లలకు వేర్వేరు విలువలను కేటాయించడం కూడా ఈ వ్యవస్థ లో భాగమే. ఎన్ఐపి ఈ ప్రక్రియను మరింత బలపరిచే ప్రమాదం ఉంది.
పేదరికంలో ఉన్న అణగారిన వర్గాల పిల్లల విద్య విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దక్షిణ కేరళలోని ట్రావెన్కోర్ వంటి ప్రగతిశీలంగా భావించే సంస్థానాలు కూడా వేరుచేయడం, విస్మరించడం అనే భావాలపైనే నడిచేవి. ఉదా హరణకు, ట్రావ న్కోర్, కొచ్చిన్లతో పాటు ఇతర సంస్థానాల్లో అణగారిన వర్గాల కోసం ప్రభుత్వ పాఠశాలలు చాలా కొద్దిగా ఉండేవి. అవి కూడా భౌతికంగా ఇతర పాఠశాలల నుండి వేరుచేసి పెట్టినవి. బోధకులు తక్కువ. వనరులు చాలా కొద్దిగా ఉండేవి. ఈ పిల్లల కోసం నడిచిన స్థానిక భాషా పాఠశాలలు ప్రధానంగా అక్షరాస్యత వంటి ప్రాథమిక విద్య మాత్రమే అందించేవి. అంతేకాదు, వారి కోసం తప్పనిసరిగా వృత్తి సంబంధిత నైపుణ్యాలనే నేర్పించేవి. అంటే వారిని మానవ శ్రమకు లేదా చిన్నచిన్న వృత్తులకే పరిమితం చేసేవి. వారిని ఉన్నత మేధో విద్య వైపు తీసుకువెళ్లేవి కావు. "కులం అన్నది మేధస్సును, ప్రతిభను నిర్ణయిస్తుంది" అనే అశాస్త్రీయ భావన ఈ వ్యవస్థ వెనుక ఉన్న ప్రధాన సూత్రం. దుర్మార్గమైన ఈ దృక్పథం నేటి సమాజపు భావజాలంలో కూడా ఆందోళన కలిగించే స్థాయిలో కొనసాగుతూనే ఉంది. అనేకమంది చరిత్రకారులు చెప్పినట్లుగా రాజ్యం విమోచనకు బదులుగా నియంత్రణ విధానాన్ని అనుసరించింది.
సంప్రదాయంగా ప్రాధాన్య వర్గాలకు చెందిన పిల్లలను భావోద్వేగపరంగా, లైంగికం గా సున్నితులుగా చూపుతూ, వారికి దీర్ఘకాలిక తల్లిదండ్రుల, సంస్థాగత రక్షణ అవసరమన్న భావన ముందుకువచ్చింది. విద్యా వ్యవస్థను వారి భావోద్వేగ, మేధోభివృద్ధికి అనుగుణంగా రూపొందించారు. భవిష్యత్తులో నాయకత్వ స్థానాలను చేపట్టేలా, వృత్తిపరమైన, నిర్వహణా ఉద్యోగాల్లో స్థానం సంపాదించేలా పాఠశాలలు వారిని తీర్చిదిద్దాయి. ఈ పక్షపాతం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఎన్ఐపి ప్రవేశపెట్టిన వృత్తి విద్యల వ్యవస్థ ఈ వివక్షాత్మక ధోరణిని మళ్లీ బలపరిచే ప్రమాదం ఉంది. నైపుణ్యాభివృద్ధి (స్కిల్లింగ్)ని సాధికారతగా చూపించినా, బలమైన రక్షణలు, పైకి ఎదిగే మార్గాలు లేక పోతే, అది అణగారిన వర్గాల పిల్లలను తక్కువ వేతనం, అస్థిరమైన ఉద్యోగాల్లోకి నెట్టివేస్తుంది. అంతర్జాతీయ మూలధన ప్రయోజనాల కోసం పనిచేసే పనులకు పరిమితం చేస్తుంది. ఇది ముందుగానే విభజనకు దారితీస్తుంది. అంటే పిల్లలను వారి ఆసక్తి, సామర్థ్యల ఆధారంగా కాకుండా పుట్టుకతో వచ్చిన సామాజిక-ఆర్ధిక పరిమితులపై ఆధారపడి వేరు చేస్తుంది. సిలబస్లోలో "శ్రమకు గౌరవం" గురించి ఎంత చెప్పినా, శ్రమే కులపరమైనముద్రతో నిండి ఉన్న సమాజంలో ఆ నినాదం శూన్యంగా, అర్థ రహితంగానే మారిపోతుంది. ఈ భావజాల పోరాటాలు "బాల్యం" అనే భావన నిష్పాక్షికం కాదనీ, అన్ని చోట్ల ఒకేలా ఉండే విశ్వవ్యాప్త సమూహం కాదనీ చూపిస్తాయి. బాల్యం అంటే ప్రతి పిల్లవాడికి సరైన మద్దతు, పోషణను పొందే తాత్కాలిక జీవన దశ మాత్రమే కాదు, అది వారిని విభజించింది. రాజ్యం, ప్రైవేటు వ్యవస్థ లు బాలలను అర్హులు, అనర్హులుగా వేరుచేసిం ది. మిషనరీల రికార్డులు చెబుతున్నట్లుగా 19వ శతాబ్ధం నుండి 20వ శతాబ్దపు ప్రారంభదశల్లో క్రైస్తవ మతంలోకి మారినవారు ముఖ్యం గా "అంటరాని" కులాలకు చెందినవారే. చాలా సందర్భాల్లో వీరు తీవ్ర ఒత్తిడితోనే పాఠశాల ల్లోకి అనుమతించబడ్డారు.
అదే సమయంలో, ఈ సమాజాలు పాఠశా లల్లో ప్రవేశించే హక్కు కోసం, దేవాలయాల్లో ప్రవేశించే హక్కు కోసం, రహదారులను ఉప యోగించే హక్కు కోసం, చెరువులు, బావుల నుండి నీళ్లు తోడుకునే హక్కు కోసం ఎన్నో దశాబ్దాలు పోరాడాయి. బాంబే ప్రెసిడెన్సీలో, 1882లో జ్యోతిరావు ఫూలే భారత విద్యా కమిషన్ (హంటర్ కమిషన్) ముందు ఇచ్చిన సాక్ష్యం అణగారిన వర్గాలను పాఠశాల విద్యకు దూరంగా ఉంచిన తీరుకు అద్దం పడుతుంది. ఫూలే, ఆయన భార్య సావిత్రి బాయి, పూణెలో అమ్మాయిల కోసం, మహర్, మాంగ్ సమాజాల పిల్లల కోసం పాఠశాలలను ప్రారంభించారు. అనాటి సమాజంలో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ వారు వెనుకంజ వేయలేదు. కమిషను ఆయన "మన పిల్లలను ప్రభుత్వం చదివించదు. ప్రతి విషయంలో మనం పక్కన పెట్టబడ్డాం" అని చెప్పారు. ఫూలే ఈ చేసిన విమర్శ, వలసపాలన విధానాల్లో దాగి ఉన్న వెలివేత భావజాలాన్ని వెలికితీసింది. రాజ్యం తన పాత్రను తిరిగి నిర్వచించుకోవాలని తేల్చి చెప్పింది. అధికారిక నివేదికలో చోటుచేసుకున్న ఇటువంటి వ్యాఖ్యలు బహిష్కరణల ద్వారా జరిగే సామాజిక హింసకు సమకాలీన సాక్ష్యా లుగా నిలిచాయి.
అదే సమయంలో అణగారిన వర్గాల సమాజాలు పాఠశాల విద్యను పొందాలన్న ఆత్రుతను కూడా ఇవి నమోదు చేశాయి. ఈ సమాచారం కారణంగా, కార్మికులు, తక్కువ కులాలకు చెందినవారి అవసరాలకు అనుగు ణంగా ప్రత్యేక లేదా రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేయాలనీ, మరింత సౌలభ్యాలు, ప్రత్యేక చర్యలు తీసుకోవాలనీ కమిషన్ సిఫారసు చేసింది. ఇవి పరిమితమైన సూచనలే అయినా, సామాన్య విద్యకు కుల పక్షపాతం ప్రధాన అడ్డంకి అని అధికారికంగా గుర్తించిన తొలి సందర్భాలలో ఒకటిగా అవి నిలిచాయి. ఇది ఫూలే వంటి కార్యకర్తలు చాలా కాలంగా చెబుతూ వచ్చిన నిజం.
అణగారిన వర్గాలు తమ భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దుకున్న సందర్భం
ఆ సమయంలోనూ, ఆ తర్వాతి దశల్లో కూడా అణగారిన కులాలు, పేద సమాజాలు స్వయంగా విజ్ఞప్తులు తయారు చేసి పాఠశాలల్లో ప్రవేశాన్ని కల్పించాలని వలస ప్రభుత్వాన్ని, సంస్థాన రాజ్యాలను కోరాయి, దక్షిణ కేరళలో ఉన్న ట్రావన్కోర్ను ఉదాహరణగా తీసుకుం దాం. అణచివేతకు గురైన "యజవ" కులస్తులు సమర్పించిన వరుస మెమోరాండాలు ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచాయి. వీరు చాలా కాలం వివక్షకు గురైనవారు. 1891లో "మలయాళి మెమోరియల్" కు వీరు మద్దతు ఇచ్చారు. దీనిద్వారా స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కోరా రు. కానీ ఈ డిమాండ్ తరువాత ప్రధానంగా ఉన్నత కుల నాయర్ల ప్రయోజనాలకే ఉపయోగపడింది. దీంతో డాక్టర్ పాల్పు నాయ కత్వంలో యజవ కులస్తులు 1895-1896లో తమ స్వంత మెమోరాండాలను సమర్పించారు. వేలాది మంది సంతకాలు చేసిన వీటిని ఇంగ్లీషులో రాశారు. వీటిలో యజవలు ఎదుర్కొన్న అన్యాయాలు,
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ నిరాకరణను నమోదు చేశారు. అలాగే, వారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశా లను స్పష్టంగా డిమాండ్ చేశారు. ఇలాంటి విజ్ఞప్తుల ప్రాముఖ్యత ఏమిటంటే అణగారిన సమాజానికి విద్య హక్కు కావాల్సిందే అన్న వాదనను అవి స్పష్టమైన భాషలో, చారిత్రక రూపంలో నమోదు చేశాయి.
వీటికి టావన్కోర్ ప్రభుత్వపు ప్రారంభస్పందన చాలా పేలవంగా ఉంది. "యజవలు విద్య కోరుకుంటే, వారి కోసం కొద్ది చోట్ల వేరే పాఠశాలలు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని దివాన్ (ప్రధాన మంత్రి) సమాధానమిచ్చాడు. ఇలా చెప్పి చివరకు రెండు ప్రాథమిక పాఠశాలలను మాత్రమే ప్రారంభించారు. ఈ అరకొర చర్య యజవలను ప్రస్తుత విద్యాసంస్థల్లో ప్రవేశించే దిశగా ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకపోగా, ఆ సమాజ నాయకులను తీవ్ర నిరాశకు గురిచే సింది. అయితే, ఈ నిరుత్సాహకరమైన స్పందనే 1903లో ఒక శక్తివంతమైన సంస్కరణ సంస్థ ఏర్పాటుకు దారితీసింది. తత్వవేత్త శ్రీ నారా యణ గురు నాయకత్వంలో స్థాపితమైన "శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం" ప్రధాన లక్ష్యాలలో విద్య ఒక్కటిగా నిలిచింది. శ్రీ నారాయణ గురు ప్రసిద్ధ సూక్తి "సంసిద్ధత ద్వారా బలపడాలి, విద్య ద్వారా విముక్తి పొందాలి" అనేది ఆ కాలపు వ్యూహాన్ని అద్భుతంగా ప్రతి బింబించింది. రాజ్యం విద్యాసంస్థల తలుపులు పూర్తిగా తెరవకపోతే, అణగారిన వర్గాలు తామే సంఘటితమై పాఠశాలలను నిర్మించుకోవాలి, అదే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి కూడా కొనసాగించాలి అన్నది ఆ భావం. ఈ విధంగా, విజ్ఞప్తులు, స్వతంత్ర ప్రయత్నాలు కలిసి ఒక నమూనాగా అనేక ప్రాంతాల్లో రూపుదిద్దు కున్నాయి.
ఇది 20వ శతాబ్దంలో మరింత దృఢమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన పోరాటాలకు పునాది వేసింది. వలస పాలనలోని భారతదేశంలో దళితుల విద్యా హక్కు కోసం జరిగిన అత్యంత ప్రభావవంతమైన ఉద్యమాల్లో ఒకదానికి ట్రావన్కోర్లో అయ్యంకాళి నేతృత్వం వహిం చారు. అయ్యంకాళి, "అంటరాని" వారిగా భావించే పులయ కులానికి చెందిన వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించారు. ప్రత్యక్ష చర్యలు, చర్చలు రెండింటినీ ఉపయోగించి, పాఠశాలలు సహా అన్ని ఉమ్యడి ప్రదేశాలపై కొనసాగుతున్న కుల ఆధిపత్యాన్ని ఆయన సవాలు చేశారు. 20వ శతాబ్దపు ప్రారంభంలో, కాగితాలపై అయినా కొన్ని కుల పరిమితులు సడలాయి. ఉదాహరణకు, కొన్ని కులాలు ఉమ్మడి రహదారులను ఉపయోగించరాదన్న ఆచారాన్ని అధికారికంగా రద్దు చేశారు. కానీ వాస్తవంలో మాత్రం పులయలు, ఇతర దళితు లను ప్రభుత్వ పాఠశాలల్లోకి అనుమతించ కుండా స్థానిక కులవాద శక్తులు అడ్డుపడుతూనే ఉన్నాయి. 1904లో అయ్యంకాళి ఆయన సహచరులు స్వయంగా ముందడుగు వేసి, వెంగనూరులో తమ స్వంత పాఠశాలను ప్రారం భించారు. ఈ చిన్నపాటి పాఠశాల ఏర్పాటు కూడా ఒక గొప్ప ప్రకటనే! అత్యంత పేద "అంటరాని"వర్గాలకు చెందినవారికీ ఆధునిక విద్యపై ఎంత ఆకాంక్ష ఉందో అది చూపిం చింది. కానీ ప్రతిస్పందన వేగంగా, హింసాత్మ కంగా వచ్చింది. దళిత పిల్లలు చదువుకుంటున్న దృశ్యం చూసి ఆగ్రహించిన ఉన్నత కులాల వ్యక్తులు దాడి చేసి పాఠశాలను తగలబెట్టేశారు. ఈ దాడి సంఘటన స్థానిక చరిత్రల్లో ఒక పెద్ద మలుపుగా నమోదైంది. దళిత విద్యను అడ్డుకునేందుకు ఉన్నత వర్గాలు ఎంత దారుణమైన హింసకైనా సిద్ధమని ఇది స్పష్టం చేసింది.
1920ల నుంచి 1930ల నాటికి పేదలు, అణగారిన కులాల విద్యా హక్కు కోసం జాతీయ స్థాయిలో గొంతెత్తిన నాయకుడు డాక్టర్ భీంరావ్ రామ్ జీ అంబేద్కర్ (1891-1956), తన స్వీయ అనుభవాలు, సేకరించిన వాంగ్మూ లాలను ఆధారంగా తీసుకుని, దళితులను పాఠశాలల దరిదాపులకు కూడా రానివ్వని అవమానకరమైన అడ్డంకులను వివరించారు ఆయన. 1927లో బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ ముందు చేసిన ఒక శక్తివంతమైన ప్రసంగంలో, అంబేద్కర్ తరగతి గదిలో కులం క్రూర వాస్త వంగా ఎలా ప్రత్యక్షమవుతుందో వివరించారు. అవి ఆయన స్వంత అనుభవాల నుంచే వచ్చి నవి. అంటరాని పిల్లలను అరుదైన సందర్భాల్లో పాఠశాలలో చేర్చినా, వారి ఉనికిని అగ్రకులస్తులు ఏమాత్రం సహించేవారు కారు. "పవిత్రమైన" తరగతి గదుల లోపల కూర్చోనివ్వక, బయట కూర్చోబెట్టిన దళిత పిల్లలకు మౌలిక హక్కులైన తాగునీటిని కూడా నిరాకరించేవారు. అగ్రకుల హిందూ విద్యార్థులను శిక్షించాల్సి వస్తే కర్రతో కొట్టే వారు. దళిత విద్యార్థులను కొట్టాల్సివస్తే రాళ్లతోనో, మట్టి కుండ ముక్కలతోనో కొట్టేవారు. అలా చేస్తే గురువుల "పవిత్రత" భంగం చెందదని భావించేవారు. అంబేద్కర్ వర్ణించిన ఈ అనుభవాలు సాధారణ విమర్శ మాత్రమే కాదు. అవమానం, బహిష్కరణ పునాదులుగా నిర్మిత మైన విద్యావ్యవస్థపై ఒక విస్పోటనంలా మారాయి. అంబేద్కర్కు పేదరికం కూడా పెద్ద అడ్డంకి అని స్పష్టంగా తెలుసు. కాబట్టే ఆయన వలస ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు ఏర్పాటు చేయాలని కోరారు. 1924లో ఆయన డిప్రెస్డ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. అలాగే బొంబాయి సహా అనేక పట్టణాల్లో దళిత విద్యార్ధులకు వసతి గృహాలు ఏర్పాటుచేయాలని కోరారు. ఇంట్లో ఎదురయ్యే కులపీడన నుంచి దూరంగా, సురక్షిత వాతావరణంలో చదువు కునే అవకాశం కల్పించడమే ఆయన లక్ష్యం. ఆధునిక పండితులు చెబుతున్నదేమిటంటే, అణగారిన కులాల విద్యా పోరాటాలు, విస్తృత మైన కుల వ్యతిరేక ఉద్యమంతో విడదీయలేని సంబంధం కలిగిఉన్నాయి. విద్య అనేది ఉద్యోగం దొరకడానికి మాత్రమే ఉపయోగపడే సాధనం కాదు. కుల వివక్షను సవాలు చేయడా నికి, సమానత్వ సాధనకు ఉపయోగపడే సాధనం! రోసలిండ్ ఓ హాన్లన్ అభిప్రాయం ప్రకారం, జ్యోతిరావు ఫూలే వంటి వారు అక్షరాస్యతను బ్రాహ్మణిక శాస్త్రాలు, కుల ఆధిపత్యాన్ని న్యాయబద్ధం చేసిన గ్రంథాలను అర్థం చేసుకుని వాటిని సవాలు చేయగల ఒక శక్తిగా చూశారు. అదే సమయంలో, పండితులు వలస పాలన ప్రభుత్వపు పరిమితమైన పాత్రను కూడా విమర్శిస్తున్నారు. 1854 వుడ్స్ డిస్పాచ్, 1882 హంటర్ కమిషన్ వంటి సంస్కరణలను ప్రవేశపెట్టినా, దళిత విద్యకి ఇచ్చిన మద్దతు తరచూ చిత్తశుద్ధి లేనట్టుగానే ఉండేది. సవ్యసాచి భట్టాచార్య చెప్పినట్లు, బ్రిటిషర్లు అణగారిన వర్గాలను చదివించడంలో ప్రధానంగా ఆధిపత్య కులాలకు చెందిన సంస్క ర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలపై ఆధారపడ్డారు. బ్రిటిషర్లకూ, ఉన్నత కులాల సంస్కరణ వాదు లకూ విద్యకు ప్రాచుర్యం లభిస్తే సామాజిక వ్యవస్థ స్థిరత్వం కోల్పోతుందేమో అన్నభయం ఉండేది.
నిజజీవిత అనుభవాల విస్మరణ
నూతన విద్యా విధానం (ఎన్ఐసి) ఈ అసమాన చరిత్రను విస్మరించింది. మౌలిక అక్షరాస్యత, బాల్య సంరక్షణ గురించి చెప్పే దాని దృక్పథం తరగతి గది బయట పిల్లలు ఎదుర్కొనే అడ్డంకుల విషయంలో ఆశ్చర్య కరంగా నిశ్శబ్దంగా ఉంది. ఉదాహరణకు, 2016లో వచ్చిన చైల్డ్ లేబర్ (నిషేధం మరియు నియంత్రణ) చట్ట సవరణ, 14 ఏళ్ల లోపు పిల్లలకు పాఠశాల సమయం తరువాత కుటుం బ వ్యాపారాల్లో పనిచేయడానికి అనుమతి స్తుంది. దీనిని "సాంస్కృతికంగా సున్నితమైన చర్య" గా చూపించినా, ఇది వాస్తవానికి బాలల చేత పనిచేయించుకోవడానికి చట్టబద్దత ఇచ్చినట్టే అయ్యింది. ముఖ్యంగా అమ్మాయిలకు, ఎందుకంటే వారికి ఇంటిపనుల్లో ఉచిత శ్రమ చేయడం తప్పనిసరి అన్న భావన ఉంది.
లక్షలాది పిల్లలకు చదువు, పని మధ్య ఉన్న ఈ అస్పష్ట గీత పాఠశాల మానేయడం, బాల్యం కుదించుకపోవడం వంటి చర్యలకు దారి తీస్తుంది. ఎన్ఐపి ఆక్షాంక్షలకు ప్రోత్సహం ఇస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దానిని కూడా అనుమానంతోనే చూడాలి. డిజిటల్ టెక్నాలజీ లు, లిబరల్ సిద్ధాంతాలు, పాపులర్ మీడియా ప్రభావంతో నేటి యువత స్టార్టప్లు, ఇన్నోవేషన్ అనే కలలను నమ్ముతున్నారు. ఎన్ఐపి కూడా ఈ ధోరణినే ప్రోత్సహిస్తోంది. కానీ అధిక సంఖ్యలో విద్యార్థుల రోజువారీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లోపం, భాషా అడ్డం కులు, నిరంతర ఆర్థిక కొరతలతో సతమత మౌతున్నాయి. బాల్య వ్యవహారాల ప్రముఖ నిపుణులు సరదా బాలగోపాలన్ చేసిన పరిశో ధనల ప్రకారం అమ్మాయిలు, దళితులు, ముస్లిం లు, వలస కుటుంబాల పిల్లలను ఈ విధానం ఉద్ధేశ్యపూర్వకంగానే బయటకు నెట్టింది. అణగారిన తరగుతుల పిల్లలు ఎక్కువమంది తరగతి గదుల వెలుపల నేర్చుకుంటారు. పొలా ల్లో, ఇళ్లలో, పట్టణ వీధుల్లో వీరి అధ్యయనం సాగుతుంది. కానీ విద్యావ్యవస్థ వారిపై "విఫలమైనవారు" అని ముద్ర వేస్తోంది. చట్టబద్ధ హామీలు మాత్రమే ఈ పరిస్థితులను మార్చలేవు. జాతీయ విద్యా విధానం హక్కుల ఆధారిత వ్యవస్థ నుండి దూరమైతే అది ఈ తరహా జనాభాను దూరంగా పెట్టినట్టే!
నిజమైన సంస్కరణ "ఫలితాల ఆధారిత ప్రమాణాల" కంటే చాలా ఎక్కువగా కోరు తుంది. అది నిర్మాణాత్మక ఆచరణను కోరు తుంది. పాఠశాలల్లో కులాన్ని పూర్తిగా అంతం చేయడం, మౌలిక సదుపాయాల్లో సమాన స్థాయిని నిర్ధారించడం, పిల్లలందరినీ పూర్తి హక్కులతో గౌరవించడం, వారిని భవిష్యత్ మార్కెట్ కార్మికుల్లా, ఉద్యోగాలకు సరిపెట్టడానికి ఉద్దేశించిన వస్తువులుగా కాకుండా చూడటం వంటివి లక్ష్యాలుగా విద్యను ప్రాథమిక హక్కుగా హామీ ఇచ్చే ఏకైక చట్టమైన 2009 నాటి విద్య దూరం చేసుకుంది. విద్యాహక్కును పేరుకే ప్రస్తావిస్తుంది కానీ, బాధ్యతగా స్వీకరించదు. హక్కు చట్టం నుండి ఎన్ఐపి తనను ఈ లోటు కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు.
ఇది ఒక భావజాలం. అంటే హక్కుల ఆధారిత వ్యవస్థ నుండి తప్పుకుని, స్వచ్చంద చర్యలు, ప్రైవేటుకు బాధ్యతలు అప్పగించడమే! దీనినే కొందరు "పాలసీ ఆఫ్ ఆబ్సెన్స్" అని పిలుస్తారు. సమానత్వం కంటే "మార్కెట్కు సిద్ధమైన" విద్యకు ప్రాధాన్యం ఇచ్చే విధానంలో, రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్యా హక్కు ప్రాధాన్యత కోల్పోతుంది.
చివరికి ఇక్కడ పణంగా ఉన్నది కేవలం బోధనా విధానం మాత్రమే కాదు! అసలు విద్య అంటే ఏమిటి, అది ఎందుకు కావాలి అన్న దృష్టికోణం కూడా పణంగా పెట్టబడింది. పాఠశాల అనేది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు విధేయ కార్మికులను తయ తయారు చేసే స్థలమా? లేక విమర్శ నాత్మక ఆలోచన, నైతిక నిర్ణయం, ప్రజాస్వామిక భావనలను పెంచే స్థలమా? కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యావిధానం స్పష్టంగా మొదటి దిశ వైపే నృజనాత్మకత, ఆశ్చర్యాన్ని ఆనందించే అవకాశాలను తగ్గిస్తుంది. ఫ్లెక్సి బిలిటీ ఉందని చెప్పినా అది కూడా పూర్తిగా కొలతలతో, మార్కెట్ అవసరాలతో స్క్రిప్ట్ చేసినది మాత్రమే! మొగ్గు చూపుతోంది. ఉత్పాదకత, ఫలితాలు, ప్రమాణీకరణపై కేంద్రీ కృతమైన దాని దృష్టి, విద్యా బోధన తరగతి గదులలో మాత్రమే జరుగుతుందన్న భావన కూడా ఒక భ్రమే! పిల్లలు పని, ఆట, భాష, కదలిక, సంరక్షణ ద్వారా నేర్చుకుంటారు. కానీ మన దేశంలోని పాఠశాల లు దీన్ని అరుదుగానే అంగీకరిస్తాయి. విద్య అనేది ఉద్యోగాలకు దారి మాత్రమే కాదు. అది న్యాయం, సమానత్వం, ప్రజాస్వా మ్యం యొక్క పునాది. ఈ దృష్టికోణం లేకుండా ఎన్ఐపి ఏ కొత్త ఆరంభాన్నీ ఇవ్వదు. అది పాత కథకే నిశ్శబ్దమైన, సుతిమెత్తని కొనసా గింపుగా మిగిలి పోతుంది.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >