| Daily భారత్
Logo




గ్రామపంచాయతీలకు ఫర్నిచర్ అందజేత

News

Posted on 2026-02-19 19:15:41

Share: Share


గ్రామపంచాయతీలకు  ఫర్నిచర్ అందజేత

ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడికైనా వెళ్తా...

గ్రామ అభివృద్ధి కోసం మీరు కూడా నాతో కలసి రండి

సంవత్సరంలో ఒక నెల గ్రామాభివృద్ధికి కేటాయించండి

ప్రముఖ వ్యాపార వేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక  దృక్పథంతో పలు గ్రామపంచాయతీ కార్యాలయాలకు ఫర్నిచర్ అందజేయాలన్న దృక్పథంతో ప్రముఖ వ్యాపార వేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి విశిష్ట  కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గ్రామీణ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో, తన సొంత ఖర్చుతో ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు రూ. 2.లక్షల విలువైన ఆధునిక ఆఫీస్ ఫర్నిచర్‌ను అందించేందుకు ముందుకు వచ్చారు. కాగా గ్రామ పంచాయతీలు ప్రజలకు అందించే సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా కొనసాగేందుకు తగిన వసతులు అవసరమని భావించిన సుభాష్ రెడ్డి  ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులు, సిబ్బంది కార్యాలయాల్లో సౌకర్యవంతంగా పనిచేయడానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలు వంటి సామగ్రిని ఆయా గ్రామాల సర్పంచులు పాలకవర్గాలకు అందజేశారు . ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సంవత్సరంలో కేవలం ఒక నెల రోజులు కేటాయించి అభివృద్ధికై పాటుపడండి అని పిలుపునిచ్చాడు. ప్రభుత్వాలను నిద్రలేపే విధంగా పని చేద్దామని ఎవరూ చేయని సాహసాన్ని మనం చేసిన రోజే విజయం మన దరికి వస్తుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గురువారం మొదటి విడతగా సుమారు 50 నుండి 60 గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సేవా కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయాల రూపురేఖలు మారి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. గ్రామీణాభివృద్ధి పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటుకుంటూ, ప్రజాసేవే పరమావదిగా  భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సుభాష్ రెడ్డి ని స్థానిక ప్రజలు, నాయకులు అభినందించారు.వారు మాట్లాడుతూ 

ఇకపై కూడా కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం విద్య, ఆరోగ్యంవంటిమౌలిక వసతులకు గాను ఎల్లవేళలా తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఆయన తెలియజేశారు అంతేకాకుండా భవిష్యత్తులో  అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి కొరకై  ప్రజా పిలుపు మేరకు రాజకీయ అరంగేట్రం కూడా సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు కూడా తాను పోటీ చేయనున్నట్లు చెప్పకనే చెప్పారు.


కార్యక్రమంలో గాయకులు మిట్టపల్లి సురేందర్, మాజీ డిసిసిబి వైస్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి కాచాపూర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కిష్టా గౌడ్, దోమకొండ సింగిల్ విండో చైర్మన్ నాగరాజు రెడ్డి,పెద్ద మల్లారెడ్డి సింగిల్ విండో చైర్మన్ రాజా గౌడ్,మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ స్వామి,మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్ నెల్లూరు రాజారెడ్డి, కమలాకర్ రెడ్డి, వెంకా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >