Posted on 2026-03-04 11:49:10
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెన్నెడీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు కలిసి ఆనందంగా పాల్గొన్నారు. పాటలు, డాన్సులతో విద్యార్థులు కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ చాటాలని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ డేనియల్ మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపుతూ, పదవ తరగతి పరీక్షల్లో పదికి పది మార్కులు సాధించేలా కట్టుదిట్టంగా సిద్ధం కావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు విశాలమైన వాతావరణంలో ఇలాంటి అంగుహార్ బాటలు లేకుండా ప్రకృతి లో నిర్వహించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >