Posted on 2026-03-06 03:24:12
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో జీహెచ్ఎంసీ అకౌంట్స్ విభాగానికి చెందిన ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
అధికారుల వివరాల ప్రకారం, ఒక ఉద్యోగికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పంపించేందుకు ఆ అధికారి ₹40,000 లంచం డిమాండ్ చేశాడు. చర్చల అనంతరం ₹35,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు.
లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతనిపై అవినీతి నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >