Posted on 2026-03-06 16:06:31
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం, మాచినేనిపేట గ్రామానికి చెందిన ఘనప నరసింహారావు, మరియు జూలూరుపాడు చెందిన కోమ్మినేని నాగేశ్వరరావు, గత కొంత కాలం నుండి జూలూరుపాడు మండల పరిసర ప్రాంత లబ్ధిదారుల వద్ద నుండి తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, మాచినపేట గ్రామ శివారుణ గల నరసింహారావు కోళ్ల ఫారం అక్రమంగా నిలువ చేసుకొని, వాటిని అవసరమైన వారికి అమ్మి, ఎక్కువ మొత్తంలో లాభాలు గడిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రేషన్ బియ్యాన్ని కోళ్ల ఫారం డంపు చేసుకుని ఉన్నారనే సమాచారంపై , జూలూరుపాడు సిఐ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి, కోళ్ల ఫారం వద్దకు వెళ్లి 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, బజాజ్ ప్లాటినా ద్విచక్ర వాహనమును,ఒప్పో కంపెనీ సెల్ ఫోన్ ను స్వాధీనపరచుకున్నారు. 23 క్వింటాళ్ల రేషన్ బియ్యం విలువ 51 వేల రూపాయలుగా ఉంటుంది. ఇరువురిపై కేసు నమోదు చేయడం జరిగినది. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >