Posted on 2026-03-06 15:41:17
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎందరో మహానీయులు పుట్టిన గడ్డ మన భారతదేశం అని దాంట్లో కారణ జనుముడు, బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ అడుగుజాడ లో నడిచి ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి గిరిజన బిడ్డ కృషి చేయాలని, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్ రావు అన్నారు.శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన భవనం లో ఏర్పాటు చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ ఉత్సవ కమిటీ భద్రాచలం నియోజకవర్గ ఆధ్వర్యంలో భోగ బండారో కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి ఐటీడీఏ పీవో బి. రాహుల్ బంజారా కమిటీ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు కమిటీ సభ్యులు బంజారా సాంప్రదాయ పరకారం ఘనంగా స్వాగతం పలికారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి భోగ్ బండారో, వింతీ కార్యక్రమం బంజారా సోదరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసిన అనంతరం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ జాతీ ఐక్యత కోసం అందరం పాటుపడాలని, పిలుపునిచ్చారు. లంబాడీలు దేవుడిగా భావించి సంత సేవాలాలును కొలుస్తారని, సేవాలాల్ జంతుబలికి తీవ్ర వ్యతిరేకి అని, తల్లిదండ్రులను మహిళలను గౌరవించాలని ప్రజలకు ఆయన బోధించారు. ప్రకృతిని వన్యప్రాణులను పరిరక్షించడం ద్వారా మానవజన్మ సార్థకత చేకూర్చుకోవాలని సూచించేవారని,ఒక సంఘ సంస్కర్త, ప్రకృతి ప్రేమికుడు ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్దారకుడు, భారతదేశంలో 10 కోట్లకు పై చిలుకు జనాభా కలిగిన బంజారాలు ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని జరుపుకుంటున్నారని అన్నారు.
అనంతరం ఐటీడీఏ పీవో బి. రాహుల్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ, గురునానక్ ,గౌతమ బుద్ధుడి లాంటి మహనీయులు ప్రజల జీవన విధానం కొరకు ఏ విధంగా పాటుపడ్డారో, లంబాడి బంజారా తెగల జీవన విధానం బాగుపడటానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని, అటువంటి మహనీయుల కోవకు చెందిన వాడే సంత్ సేవలల్ మహా రాజ్ అని, మన భారత దేశంలోనే కాక కర్ణాటక నుండి ఉత్తరప్రదేశ్ వరకు రాజస్థాన్ నుండి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న బంజారా జాతి జీవన విధానం కొరకు ఆయన పాటుపడ్డారని, దేశంలోని గోరు బంజారాలకు స్ఫూర్తిని నింపిన మహానుభావుడు అని, సంచార జీవితం నుండి ప్రతి బంజారా తెగలను తండ జీవితం వైపు మళ్ళించారని, మద్యం మాంసాలను మాన్పించే ప్రయత్నం చేశాడని, బంజారా తెగల అభివృద్ధికి దేశమంతటా సంచారం చేసి హితబోధ చేశాడని ఆయన అన్నారు. బ్రిటిష్ కాలంలో కూడా మతమార్పిడిని వ్యతిరేకించిన మహనీయుడనీ, సేవాలాల్ మహారాజ్ 18వ శతాబ్దానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక గురువు , సంఘసంస్కర్త, ఆయనను బంజారా లు తమ ఇష్ట దైవంగా పూజిస్తారని, ఆయన ఫిబ్రవరి 15, 1739న అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలోని సేవాగడ్ (రామచంద్రపురం) లో జన్మించారని, అహింస, శాంతి మరియు మానవత్వాన్ని ఆయన బోధించేవారని, ముఖ్యంగా మూఢనమ్మకాలను విడనాడాలని, పర్యావరణాన్ని ప్రేమించాలని మరియు మహిళలను గౌరవించాలని ఆయన ప్రజలకు హితబోధ చేసేవాడని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం జడ్జి శివ నాయక్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్, భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పి వి టి జి అధికారి గన్యా ,బంజారా సంఘం నాయకులు భూక్యా రంగా, లకావత్ వెంకటేశ్వర్లు, బన్సీలాల్, మోహన్ లాల్, గోవింద్, భూక్యా రంజిత్, రాందాస్, భూక్య సాయి కౌశిక్, , నాగులు, వంకుదోత్ కృష్ణ, బిక్ష, సైదులు, శీతల నాయక్, రాందాస్, మోహన్ నాయక్, కోటి, జుంకీలాల్, సీతయ్య నాయక్, మదన్ నాయక్, మదర్, బంసిలాల్ ,వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బంజారా సోదరులు, సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >