Posted on 2026-03-06 15:39:42
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు,జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అటు ప్రభుత్వ రంగం నుండి కొత్త ఉద్యోగ ప్రకటనలు తక్కువగా రావడం, ఇటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఈ రెండు కలసి ఒక కుంభమేళం లాగా నిరుద్యోగాన్ని పెంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నియామక ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరగడం, గ్రూప్ పరీక్షల ప్రకటనలు సంవత్సరాల తరబడి అలస్యం అవుతుండగా, నియామకాల్లో తారతమ్యాలు, కోర్టుల స్టేలు, రాజకీయ ప్రతిస్పందనలు మరింత కల్లోలం సృష్టిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యువత తమ జీవిత భద్రతపై ఆశను కోల్పోతున్నారన్నారు. రాబోయే 10-20ఏళ్లలో మనం తీవ్ర సంక్షోభాన్ని, సామాజిక అసమతుల్యతను ఎదుర్కొవల్సి వస్తుందని. దీనికి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయాలన్న చొరవ పాలకుల నుండి కనిపించడం లేదన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలు వేగవంతం చేయాలని, ఖాళీలను నిబంధనలతో నింపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని అన్నారు. నిరుద్యోగ యువతకు నిరంతరం ధైర్యం ఇచ్చేవిధంగా ప్రభుత్వ రంగం ముందుకు రావాలని,. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఆర్థిక మద్దతు లేదా స్వయం ఉపాధి యోజనాల ద్వారా భరోసా కల్పించాలన్నారు. నవతరానికి సామాజిక భద్రత, పెన్షన్, ఆరోగ్యబీమా, విద్యా సహాయం వంటి రంగాల్లో యువతకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని అన్నారు. ఈ మార్గాల్లో చర్యలు తీసుకోకపోతే రేపటి సమాజం ఘోరసంక్షోభాన్ని ఎదుర్కొవలసి వస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గడిచిన 12ఏండ్ల కాలంలో బడా కార్పొరేట్ లకు 15లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను అక్రమంగా దోచి పెట్టిన నీచ చరిత్రను మూటగట్టుకున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో బడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం కు 37శాతం పన్ను కడితే, ఈ బీజేపీ హయాంలో దానిని 16శాతానికి తగ్గించారని, దీని కారణంగా దేశ సంపదకు 9లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆరోపించారు.బడా కుబేరులకు యథేచ్ఛగా రాయితీలు ప్రకటించి, కార్పొరేట్ సంస్థల ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇప్పటికీ సంపూర్ణ జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం తీవ్ర అన్యాయం అని, ప్రభుత్వ శాఖల్లో లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటి భర్తీకి సంబంధించి స్పష్టమైన కాలపట్టిక ఇవ్వకపోవడం వల్ల యువతలో అయోమయం, ఆందోళన పెరుగుతోందని, ఇది కేవలం పరిపాలనా వైఫల్యం అని, ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని,రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >