Posted on 2026-03-06 18:56:12
టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు
డైలీ భారత్, కామారెడ్డి: జర్నలిస్టులపై కొందరు నాయకులు తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని టి డబ్ల్యూ జేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు అన్నారు. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టిన ముత్తగారి శిరీష్ గౌడ్, ముత్తగారి రోజా ల నిర్మాణాన్ని అధికారులు కూల్చివేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై తీసుకున్న ఈ చర్యను స్వాగతిస్తున్నామనీ టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి ప్రవీణ్ గౌడ్, జిల్లా కార్యదర్శి కర్ణాకర్ మరియు నేషనల్కౌన్సిల్ మెంబెర్ శీర్ల వంచ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వార్తా కవరేజ్ కోసం విధులు నిర్వహించడానికి వెళ్లిన జర్నలిస్టులపై శిరీష్ గౌడ్ పోలీసులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగం ద్వారా తప్పుడు కేసులు నమోదు చేయించడం ఖండిస్తున్నామన్నారు. తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నామనీ, ఈ చర్య ద్వారా , ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం),
ఆర్టికల్ 19(1)( ఏ ) (భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ - పత్రికా స్వేచ్ఛ), ఆర్టికల్ 19(1)( జి ) ( వృత్తి నిర్వహణ హక్కు ), ఆర్టికల్ 21 (జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ)
లు భంగం పొందాయన్నారు. జర్నలిస్టులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలనీ,
అక్రమ కేసులు నమోదు చేసిన సంబంధిత పోలీసు అధికారులపై విచారణ చేపట్టాలనీ, జర్నలిస్టులు భయభ్రాంతులు లేకుండా విధులు నిర్వహించేలా రక్షణ కల్పించాలన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఏన్ని రోజులకైనా నిజం నిజమే అవుతుంది, అబద్ధం అబద్దమే అవుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడబ్ల్యుజేఎఫ్ సభ్యులు కాషా గౌడ్, బాలు, పిట్ల అనిల్ కుమార్,చంద్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >