| Daily భారత్
Logo




ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

News

Posted on 2026-03-07 21:33:43

Share: Share


ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం నగరంలోని నిజాంపేట్ ప్రాంతంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

డైలీ భారత్, ఖమ్మం: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఖజూర్ పండును తినిపిస్తూ ఇఫ్తార్ విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.మత సామరస్యాన్ని కాపాడుతూ అందరం కలిసి ముందుకు సాగితేనే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు.అల్లా దయ అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని,రాష్ట్ర ప్రజలు మరియు ఖమ్మం ప్రజలు సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం అల్లా అనుగ్రహంతో మరింత శుభాలు, శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు.అదే విధంగా KCR  నాయకత్వంలోని BRS ప్రభుత్వ కాలంలో రంజాన్ సందర్భంగా అందించిన రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఆయన గుర్తు చేశారు. నిరుపేద ముస్లింలకు ఆ సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా రంజాన్ తోఫాను అర్హులైన పేదలకు అందించేలా చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనంతరం ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో మహమ్మద్ నజీముద్దీన్  ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడి స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలిపుకున్నారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ మక్బుల్,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, టౌన్ మైనారిటీ అధ్యక్షుడు షంసుద్దీన్,మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, నజీముద్దీన్,ముజాహిద్,పాషా,జవాద్,అజాంచోటు,తౌసిఫ్,షబ్బీర్,మున్నా,చంటి,అజీమ్,గురుమూర్తి,ఇజారుద్దీన్,మైనార్టీనాయకులు,కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >