| Daily భారత్
Logo




అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్

News

Posted on 2026-03-08 18:59:27

Share: Share


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్

మహిళా పోలీసుల సంక్షేమమే ధ్యేయం

106 మంది మహిళా సిబ్బందికి అత్యాధునిక వైద్య పరీక్షలు - ఉచిత మందుల పంపిణీ.

మీరు అబలలు కాదు.. సకల శక్తులు కలిగిన సబలలు: ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపిఎస్.

"సిబ్బంది సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత": జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేక సంకల్పంతో మహిళా పోలీసులకు మెగా హెల్త్ క్యాంప్

డైలీ భారత్, కామారెడ్డి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని మహిళా అధికారులు, మహిళా సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ ప్రత్యేక సంకల్పంతో ఈరోజు భారీ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా శక్తిని గౌరవిస్తూ, విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే వారికి నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికేర్ ఆసుపత్రి నిపుణులైన డాక్టర్ల సహకారంతో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో సుమారు 106 మంది మహిళా సిబ్బందికి అత్యాధునిక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా ఏఎస్పీ కె. నరసింహ రెడ్డి మాట్లాడుతూ, మహిళా పోలీసు సిబ్బందికి ఉండే అదనపు బాధ్యతలను గుర్తుచేశారు. "మీరు ఒకవైపు కఠినమైన పోలీసు విధులు నిర్వహిస్తూనే, మరోవైపు కుటుంబ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మీలోని ఈ బహుముఖ ప్రజ్ఞ సమాజానికి ఆదర్శం. అయితే, అందరి సంక్షేమం కోసం పాటుపడే క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ చిరునవ్వు, మీ దృఢత్వం జిల్లా పోలీసు శాఖకు అసలైన బలం" అని వారిని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ మహిళా పోలీసులలో కొత్త ఉత్తేజాన్ని నింపారు. "మహిళలు అబలలు కాదు, సకల శక్తులు కలిగిన సబలలని, ఈ ఖాకీ యూనిఫామ్ ధరించిన ప్రతి మహిళా అధికారి సమాజానికి ఒక ధైర్యమని" ఆమె కొనియాడారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమిస్తూనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, తనకు ఏ కష్టం వచ్చినా ఒక పై అధికారిలా మాత్రమే కాకుండా, ఒక తోడబుట్టిన అక్కలా ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏఎస్పీ ఇచ్చిన భరోసా మహిళా పోలీసులలో కొండంత ధైర్యాన్ని నింపింది. ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మహిళా శక్తికి ఆకాశమే హద్దు అని ఆమె పిలుపునిచ్చారు. సిబ్బంది సంక్షేమం కోరి ఈ బృహత్తర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ కి ఏఎస్పి  మరియు సిబ్బంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో నిపుణులైన కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ మరియు నేత్ర వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించారు. బి.పి, షుగర్ పరీక్షలతో పాటు ఈసీజీ (ECG), 2D ఎకో, బి.ఎం.డి (BMD) మరియు డిజిటల్ ఎక్సరే వంటి కీలక పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన డా. సంతోష్ (RMO), డా. దినకర్ కార్డియాలజిస్ట్, డా. సురేఖ, డా. విజ్ఞ, డా. శుభ, డా. అంచల్ మరియు నేత్ర వైద్య సహాయకులు హరికృష్ణలను జిల్లా కామారెడ్డి అదనపు ఎస్పి నరసింహ రెడ్డి, ఏఎస్పీ బి చైతన్య రెడ్డి ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నర్సింహారెడ్డి, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపిఎస్, కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ నరహరి, జిల్లాలోని మహిళా అధికారులు, మహిళా సిబ్బంది, ఆర్.ఎస్.ఐ లు మరియు డి.పి.ఓ మహిళా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >