Posted on 2026-03-08 20:35:19
రిబ్బన్ కట్ చేసిన రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్
డైలీ భారత్, కామారెడ్డి: బిబిపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో చెప్త్యాల లత నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్ గారు హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన నూతన గృహంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదవాడి సొంతింటి కల సాకారం కావడమే ప్రభుత్వ ధ్యేయమని, యువతరం ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చెప్త్యాల లత
ఈ సందర్భంగా లబ్ధిదారు చెప్త్యాల లత మాట్లాడుతూ, తమకు సొంతింటి కల నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన యువ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ గారు తమ చేతులతో ఇల్లు ప్రారంభించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, (పీసీసీ జనరల్ సెక్రటరీ)సుతారి రమేష్ (బిబిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) రాజు (మార్కెట్ కమిటీ చైర్మన్) మాజీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ఇంద్రసేనారెడ్డి మట్ట సీను సాత్విక సాయినాథ్, వెంకట్ గౌడ్, వెంకట్రావు, చెప్యాల రాజేష్, దడిగే శేఖర్, రవీందర్ రెడ్డి, నాగేశ్వర్, సలీం, మహేష్, శ్రవణ్ గౌడ్, గాడి లింగం, తోట రమేష్, నరసింహారెడ్డి, నాగరాజు, రవి, స్వామి, గంప ప్రసాద్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >