| Daily భారత్
Logo




అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

News

Posted on 2026-03-13 16:39:38

Share: Share


అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించిన, అక్రమ మార్గంలో అమ్మిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు..

గ్యాస్ సరఫరా ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలి.

నకిలీ వ్యక్తులకు గ్యాస్ సిలిండర్ లు ఇవ్వకూడదు.

గ్యాస్ అమ్మకాలపై పోలీస్ శాఖ నిగా ఉంచింది.

సరిపడా గ్యాస్ నిలువలు అందుబాటులో ఉన్నాయి, ప్రజలు ఆందోళన చెందవద్దు.

కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

డైలీ భారత్, సూర్యాపేట: నమ్మదగిన సమాచారం పై సూర్యాపేట పట్టణ పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది సూర్యాపేట పట్టణంలో పిఎస్ఆర్ సెంటర్ నందు ఒక షాపులో తనిఖీలు నిర్వహించగా అందులో అక్రమంగా నిల్వచేసిన 41 సిలిండర్ లు గుర్తించడం జరిగిందని వీటిని సీజ్ చేశామని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 21 గృహ ఉపయోగకరమైనయని, 20 వాణిజ్యపరమైనని ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించి అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడే గ్యాస్ సిలిండర్లను అక్రమ మార్గంలో అమ్మిన, అక్రమంగా నిలువచేసిన, కృత్రిమ కొరత సృష్టించిన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ ఉపయోగకరమైన గ్యాస్ సిలిండర్లను వాణిజ్యపరంగా అమ్మకూడదని సూచించారు. ప్రజల ఉపయోగాలు, హాస్పటల్ వినియోగానికి నిలువలు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ లను అక్రమ మార్గంలోకి తరలించినా, గ్యాస్ నిల్వలపై, గ్యాస్ ధరలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్ నిలువలు అందుబాటులో ఉన్నాయని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం సంబంధిత ఏజెన్సీలు గ్రామాలలో, పట్టణాలలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సకాలంలో అందిస్తాయని అన్నారు. ప్రజలు ఆందోళన చెంది గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరవద్దని, గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించవద్దని కోరారు. గ్యాస్ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా నకిలీ వ్యక్తులు గ్యాస్ ను బుక్ చేసినట్లయితే అలాంటి వారిని గుర్తించాలని కోరారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న ఏజెన్సీలు బాధ్యతగా ఉండాలని కోరారు. గ్యాస్ అమ్మకాల కు సంబంధించి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >