Posted on 2026-03-13 16:46:49
డైలీ భారత్, హుజూర్ నగర్: రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకురాలు మహిళా సాధికారతకు కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా జాగృతి శ్రేణుల ఆధ్వర్యంలో శుక్రవారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియ చేశారు.ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ రావు, షేక్ మస్తాన్ లు మాట్లాడుతూ మహిళా సాధికారత సామాజిక సేవలో ఆమె చేసిన కృషిని కొనియాడారు.
రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలిగా కవిత గుర్తింపు పొందారన్నారు భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని కోరారు. మహిళా బిల్లు చట్టంగా రూపొందడానికి, బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ సాధనకు కవిత పోరాటం చేసారన్నారు.
ఇటీవల ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామంలో ఇండ్ల కూల్చివేత బాధితుల పక్షాన నిలబడి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి బాధితులకు న్యాయం చేయడం కవిత పోరాట ఫలితమన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయడంలో విఫలమైతే కవిత ప్రశ్నించే గొంతుకై బాధితుల పక్షాన పోరాటం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో కె.సత్య నారాయణ రెడ్డి, సౌదశోతు బిక్షం, మామిడి పన్నీరు, సిహెచ్ నర్సింహ రావు, పి.నర్సింహ రావు వేణు, బానోతు నర్సింహ , వెంకట కృష్ణ, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >