Posted on 2026-03-18 18:28:43
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రశాంత వాతావరణం, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు , పరీక్షలకు హాజరైన విద్యార్థుల హాజరు శాతం, తదితర వాటి పై ఆరా తీశారు.
ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >