| Daily భారత్
Logo




రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-03-18 18:43:40

Share: Share


రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

గంభీరావుపేట సీహెచ్ సీని పరిశీలించిన కలెక్టర్.

డైలీ భారత్, గంభీరావుపేట : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) లో కలెక్టర్ బుధవారం పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ పేషెంట్ వార్డులు, మందులు ఇచ్చే గది, స్టోర్ రూమ్, వ్యాక్సినేషన్ గది, ఎక్స్ రే గది, యునాని హాస్పిటల్, ఆసుపత్రి ఆవరణ అంతా పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండాలని ఎంపీడీఓకు సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన మరమ్మత్తు పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, జిల్లా వైద్య అధికారి రజిత, డీసీ హెచ్ ఎస్ రవీందర్,  సర్పంచ్ మల్లుగారి పద్మ, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, డాక్టర్ సృజన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >