| Daily భారత్
Logo




జాతీయ క్రీడల్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ : విజేతలను అభినందించిన డిజిపి

News

Posted on 2026-03-18 18:48:12

Share: Share


జాతీయ క్రీడల్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ : విజేతలను అభినందించిన డిజిపి

డైలీ భారత్ హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ వేదికగా ఇటీవల ముగిసిన 2వ ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ (2025-2026) క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు  ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసుల కీర్తిని చాటారు. పతకాలతో తిరిగి వచ్చిన క్రీడాకారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి  తన  కార్యాలయంలో  అభినందించారు.

ఈ పోటీల్లో పురుషుల ఖో-ఖో విభాగంలో తెలంగాణ జట్టు పట్టుదల ప్రదర్శించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. వివిధ విభాగాలకు చెందిన 15 మంది క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చాటి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇన్ స్పెక్టర్లు బి. శ్రీనివాస్, ఎస్. మట్టం రాజు (సైబర్ క్రైమ్), ఆర్ఎస్ఐ ఎ. రమేష్, వనస్థలిపురం పీఎస్‌కు చెందిన పి. రంజిత్ కుమార్  కోచ్, కెప్టెన్లుగా వ్యవహరించగా, వివిధ టీజీఎస్పీ  బెటాలియన్లకు చెందిన కానిస్టేబుళ్లు జట్టు గెలుపులో తమ వంతు సహకారాన్ని అందించారు.

అలాగే మహిళల ఫెన్సింగ్  విభాగంలో భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ షేక్ ఫౌజియా అసాధారణ ప్రదర్శన చేశారు. ఫైనల్ వరకు దూసుకెళ్లిన ఆమె, హోరాహోరీ పోరులో రజత పతకాన్ని సాధించి రాష్ట్ర పోలీస్ శాఖకు పేరు తెచ్చారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన ఎన్.ఐ.ఎస్ ఫెన్సింగ్ కోచ్ ఎస్.ఆర్. అర్జున్ ఆనంద్ కృషిని కూడా డిజిపి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐ జి పి డా. గజరావు భూపాల్, స్పోర్ట్స్ ఆఫీసర్ డా. ఆర్.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >