Posted on 2026-03-18 20:57:57
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ స్పోర్ట్స్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
కామారెడ్డిని క్రీడల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.
ఇందిరాగాంధీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు రూ. 8 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు.
అదేవిధంగా, స్టేడియాన్ని ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి చేయడానికి అదనంగా ఒక ఎకరా స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు.
ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి స్థలం కోరగా, వెంటనే ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
ఆ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్‌కు అందజేసినట్లు వెల్లడించారు.
ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులను మరియు ప్రతిపాదిత ఇండోర్ స్టేడియం స్థలాన్ని అధికారులు కలిసి పరిశీలించినట్లు పేర్కొన్నారు.
స్టేడియం అభివృద్ధికి టెక్ మహీంద్రా సంస్థ సుమారు రూ. 70 లక్షల వరకు సహకారం అందించినట్లు తెలిపారు.
స్టేడియంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలు తెలియజేశారు
అంతర్జాతీయ ప్రమాణాలతో రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు
ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ
గ్యాలరీలు మరియు ప్రేక్షకుల సౌకర్యాలు
ప్రతిపాదిత స్థలంలో అత్యాధునిక ఇండోర్ స్టేడియం నిర్మాణం
అదనంగా క్రీడాకారులకు అవసరమైన జిమ్, 8 లైన్ల వాకింగ్ ట్రాక్, రైఫిల్ షూటింగ్ సౌకర్యం, టెన్నిస్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు, టేబుల్ టెన్నిస్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
స్టేడియానికి సంబంధించిన భూమి రికార్డులను సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి ఆక్రమణలు లేకుండా హద్దులను స్పష్టంగా నిర్ణయించాలని అధికారులకు ఆదేశించారు.
అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వాలు క్రీడలను నిర్లక్ష్యం చేశాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కామారెడ్డి యువతకు మెరుగైన శిక్షణ అందించేందుకు ఈ స్టేడియం కీలక వేదికగా మారుతుందని అన్నారు.
నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
పట్టణ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఉమాశ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పాత రాజు, సుతారి రమేష్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఐరేనీ సందీప్ ,గుడుగుల శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >