Posted on 2026-03-26 19:16:04
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండల నాయకులు కాకర్ల గ్రామానికి చెందిన చెంగల గురునాధం ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని కాకర్ల గ్రామానికి విచ్చేసి సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.కుటుంబానికి ఎం ఆర్ పి ఎస్ అండగా ఉంటుందని హామి ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ తొలి తరం నాయకులు మండలంలో ఉద్యమాన్ని నడిపించిన మోదుగు ఆదాం,ప్రభాకర్, వేల్పుల నరసింహరావు,మిరియాల ఫ్రాన్సిస్, కిన్నెర దేవయ్య తో పాటు ఎం ఆర్ పి ఎస్ నాయకులు కొత్తపల్లి సోమయ్య,ఏపూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు తగరం వెంకట నరసింహారావు, మండల అధ్యక్షులు దెబ్బెందుల సాయి కుమార్, వేల్పుల భాస్కర్, ఖమ్మం జిల్లా నాయకులు తూరుగంటి అంజయ్య,దేపంగి రమణయ్య, మంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >