| Daily భారత్
Logo




వాహనాల తనిఖీలో దొరికిపోయిన మొబైల్ దొంగ

News

Posted on 2026-03-26 20:27:03

Share: Share


వాహనాల తనిఖీలో దొరికిపోయిన మొబైల్ దొంగ

నిందితుడి అరెస్ట్, నగదు మరియు సెల్ ఫోన్లు స్వాధీనం

గంటల వ్యవధిలోనే మొబైల్ షాపులో దొంగతనం కేసు ఛేదించిన  మాచారెడ్డి పోలీసులు

కేసును చాకచక్యంగా ఛేదించిన మాచారెడ్డి పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ 

 వివరాలు వెల్లడించిన మాచారెడ్డి ఎస్‌హెచ్‌ఓ అనిల్ 

డైలీ భారత్, మాచారెడ్డి: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అంకిరెడ్డిపల్లి తాండ గ్రామానికి చెందిన పిర్యాదిదారుడు గూగులోత్ చందు (తండ్రి: రాములు)  మొబైల్ షాప్ మాచారెడ్డి చౌరస్తా వద్ద ఉండగా, తేది 25/26-03-2026 రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి మూడు సెల్ ఫోన్లు మరియు కొంత నగదు దొంగిలించారు. ఈ మేరకు మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.

దర్యాప్తులో భాగంగా  ఉదయం మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో, అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అజ్మీర అశోక్ @ గణేష్ (వయసు: 29 సంవత్సరాలు) అనుమానాస్పదంగా బైక్‌పై వస్తూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే తేది 25-03-2026 రాత్రి సమయంలో గూగులోత్ చందు గారి మొబైల్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి మూడు సెల్ ఫోన్లు మరియు నగదు దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుని ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగినది. 

నిందితుని వద్ద నుండి స్వాధీనం పర్చుకున్న వస్తువులు:

1.మూడు మొబైల్ ఫోన్లు  2. హెడ్‌సెట్  3. కొంత నగదు 

ఇట్టి దొంగను చాకచక్యంగా పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ , హోం గార్డ్ భాస్కర్ లను మరియు కేసు విచారణలో ప్రతిభ కనబర్చిన మాచారెడ్డి ఎస్‌హెచ్‌ఓ అనిల్ ని జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ అభినందించారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >