| Daily భారత్
Logo




పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ

News

Posted on 2026-03-27 08:48:01

Share: Share


పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ

ఒబేసిటీ ముక్త్ భారత్ మిషన్ హెల్తీ భారత్ యాత్రకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు

డైలీ భారత్, మంగళగిరి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరఠ్ కు చెందిన 23 ఏళ్ల యంగ్ బైకర్ తాప్పీ ఉపాధ్యాయ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒబేసిటీ ముక్త్ భారత్ - మిషన్ హెల్తీ భారత్ పేరిట ఆమె చేపట్టిన బైక్ యాత్ర వివరాలను పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు.

ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు మార్చి 9, 2025న మేరఠ్ లో బైక్ యాత్ర ప్రారంభించినట్లు తాప్పీ ఉపాధ్యాయ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 17,400 కిలోమీటర్ల ప్రయాణించి, 500పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 12 రాష్ట్రాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ పై సోలోగా ప్రయాణిస్తూ ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్న తాప్సీ ఉపాధ్యాయను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఆమె యాత్ర చాలా మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని అభిలషించారు. మిషన్ హెల్తీ భారత్ లక్ష్యంతో ఆమె చేపట్టిన సాహసోపేత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >