| Daily భారత్
Logo




కామారెడ్డి లో భారీ దొంగతనం

News

Posted on 2026-04-13 16:18:09

Share: Share


కామారెడ్డి లో భారీ దొంగతనం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ సాయి అపార్ట్ మెంట్ లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే బాలకృష్ణ రాజంపేట ఎంపీడీవోగా పనిచేస్తు న్నారు. బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి పనిమీద ఫ్లాట్ కు తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. 40 తులాల బంగారం, 60తులాల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం  బృందాలు వివరాలు సేకరించాయి. పోలీసులు అపార్ట్మెంట్, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ నరహరి తెలిపారు.

 బాలకృష్ణ బాధితుడు

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >