| Daily భారత్
Logo




జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై పోలీసుల కొరడా

News

Posted on 2026-05-22 15:56:34

Share: Share


జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై పోలీసుల కొరడా

అక్రమ మట్టి రవాణాపై 19 కేసులు నమోదు, 45 వాహనాలు సీజ్.

అనుమతిలేని అక్రమ మట్టి తరలింపుపై ప్రత్యేక నిఘా

అక్రమంగా మట్టిని తరలించినా,తవ్వకాలు చేసినా,నిల్వ చేసినా సమాచారం అందించండి.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అనుమతి లేకుండా మట్టి తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాలో అక్రమ మట్టి రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈసంవత్సరం ఇప్పటివరకు అక్రమ మట్టి రవాణాకు సంబంధించి మొత్తం 19 కేసులు నమోదు చేసి, 45 వాహనాలను(27 ట్రాక్టర్లు,11 తిప్పర్స్, 07 జేసిబి లు) సీజ్ చేసినట్లు వెల్లడించారు.అక్రమ మట్టి రవాణాపై పోలీసుల వరుస దాడులు కొనసాగిస్తూ కేసులు నమోదు చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ మేరకు జిల్లా ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి త్రవ్వకలు జరిగిన, రవాణా చేసిన కేసులు తప్పవని,జిల్లాలో ఎక్కడైనా మట్టిని తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయాలంటే ముందస్తుగా సంబంధించిన శాఖ నుండి అనుమతి పొందాలని,లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జిల్లా పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలించినా,తవ్వకాలు చేసినా,నిల్వ చేసినా సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

గడిచిన వారం రోజులలో జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై నిర్వహించిన డ్రైవ్ వివరాలు.

●.తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 3 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.

●.వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు.

●.బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి ఒక జేసీబీ, 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

●.రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 2 టిప్పర్లు, 5 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు.

●.వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >