| Daily భారత్
Logo




ఉద్రిక్తత మధ్య కల్వకుంట్ల కవిత, కార్యకర్తల అరెస్ట్

News

Posted on 2026-05-22 16:04:06

Share: Share


ఉద్రిక్తత మధ్య కల్వకుంట్ల కవిత, కార్యకర్తల అరెస్ట్

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో వరి ధాన్యం, జొన్నల కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో శుక్రవారం సెక్రటేరియట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన జరిగింది. సచివాలయం ఎదుట ప్రధాన రహదారిపై వరి ధాన్యాన్ని పోసి కవిత తన పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. "రాష్ట్రవ్యాప్తంగా కల్లాల్లోనే ధాన్యం ఎండిపోతోంది. అన్నదాతలను ప్రభుత్వం అరిగోసలు పెడుతోంది. తెలంగాణ రైతుల బాధలు, వారి గోస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి తెలియాలనే నేరుగా సచివాలయం వద్దకు వచ్చి నిరసన తెలుపుతున్నాం" అని ఆమె స్పష్టం చేశారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా.. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా కనీసం సమీక్ష నిర్వహించకపోవడం రైతుల పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంతో పాటు, జొన్నలను కూడా తక్షణమే మద్దతు ధరతో పాటు బోనస్ అందించి కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సెక్రటేరియట్ వద్ద ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. కవితతో పాటు నిరసనలో పాల్గొన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతుల సమస్యలపై తమ పోరాటం ఆగదని, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా టి.ఆర్.ఎస్ (TRS) శ్రేణులు నినాదాలు చేశారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >