Posted on 2026-05-22 19:22:23
డైలీ భారత్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాలు నుండి ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన నేరగాళ్ళు ఇండ్ల చోరీలతో పాటు, చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్థారణ కావడం, ముఖ్యంగా దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ కేంద్ర బిందువుగా వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు మారడంతో నేరగాళ్ళు రైలు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోని పలు చోరీలకు పాల్పడటం, అనంతరం నిందితులు ఇదే రైలు మార్గం ద్వారా తిరిగి వారి స్వస్థలాలకు చేరకుంటున్నారు. ఇలాంటి నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అంతర్ రాష్ట్ర దొంగలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపోందించారు. ఇందులో భాగంగా అంతర్‌రాష్ట్ర దొంగలను ముందుగా గుర్తిండం అలాగే చోరీల కట్టడికై రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా క్రైమ్స్ అదనపు డిసిపి బాలస్వామి, సిసిఎస్ ఏసిపి సదయ్య అధ్వర్యంలో నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. రెండు బృందాలు చోప్పున వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సహకారంతో విధులు నిర్వహిస్తారు. దేశంలోని వివిధ మార్గాల ద్వారా ముఖ్యంగా ఉత్తర భారత దేశం నుండి వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఆగే రైళ్ళలో ఇక్కడకి చేరుకున్న ప్రయాణికుల్లో ఈ ప్రత్యేక పోలీస్ బృందం సభ్యులు అనుమానిత ప్రయాణికులను గుర్తించి వారిని, వారి సామగ్రిని సైతం కుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు వారి నుండి పూర్తి వివరాలను సేకరించిన అనంతరం ఈ ప్రత్యేక పోలీస్ బృందం సభ్యులు అనుమానిత వ్యక్తుల సంబంధిత వ్రేలి ముద్రలు, ముఖాలను ఫేస్ రికగ్నైజేషన్‌తో పాటు పోలీసుల వద్ద వున్న ఆధునిక పరిజ్ఞానంతో దేశంలోని నేరస్థులకు సంబంధించిన డాటా బెస్‌తో అనుసంధానం చేసి సంబంధిత అనుమానిత వ్యక్తులను పరీక్షంచడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో ఒక వేళ తనిఖీ చేసిన వ్యక్తి గతంలో ఏదైన నేరానికి పాల్పడినట్లయితే క్షణాల్లో పోలీసులు వినియోగిస్తున్న టెక్నికల్ డివైజ్‌కు అనుమానితుడి పూర్తి వివరాలు చేరిపోతాయి. దీనితో తక్షణమే పోలీసులు అప్రమత్తమై సదరు అనుమానితులను అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది. ఇదే సమయంలో ఈ బృందాలు తనిఖీలు చేసే సయమంలో అనుమానిత పూర్తి వివరాలను సైతం రికార్డుల రూపం భద్రపర్చడం జరుగుతుంది. నలుగురు సభ్యులు వున్న ప్రత్యేక బృందంలో ప్రతి రైల్వే స్టేషన్‌ల్లో షిఫ్ట్‌ల వారిగా విధులు నిర్వహిస్తు నిరంతరం అనుమానితులను తనిఖీలు నిర్వహిస్తూ అంతరాష్ట్ర దొంగలకు చెక్ పెడుతున్నారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >