Posted on 2026-05-24 11:00:55
మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక డ్రైవ్
డైలీ భారత్, కోదాడ: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలో నార్కోటిక్ డాగ్ “రోలెక్స్” సహాయంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రంగా థియేటర్ చౌరస్తా, ఖమ్మం అడ్డరోడ్, బస్టాండ్ ప్రాంతాల్లో పాన్ షాపులు, టీ దుకాణాలు, మార్కెట్ ప్రాంతాలను తనిఖీ చేసినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్ తెలిపారు. మత్తు పదార్థాల అమ్మకం, వినియోగం, రవాణాను అరికట్టడమే లక్ష్యమన్నారు. 18 ఏళ్ల లోపు వారికి టొబాకో ఉత్పత్తులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >