Posted on 2026-06-09 16:40:18
నిందితుడుకి 20 సంవత్సరాల జైలు శిక్ష, రు.5000/- జరిమానా
పోలీసు–ప్రాసిక్యూషన్ సమన్వయంతో నిందితులకు వరుస శిక్షలు
నిందుతుడికి శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను , పిపి,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
డైలీ భారత్, గంభీరావుపేట:
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన (పోక్సో) కేసులో నిందుతుడీకి 20 సంవత్సరాలు జైలు ,5000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
కేసు వివరాలు..
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను గోరింటాల గ్రామానీకి చెందిన కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి గురి చేయగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మెరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అప్పటి సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్ కి తరలించారు.అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది.
కోర్టు తీర్పు..
కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్,cms కానిస్టేబుళ్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున గత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ గారు వాదించగా, శాస్త్రీయ ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరము రుజువు కావడంతో నిందితుడైన కోటగిరి శ్రీనివాస్ కి 20 సంవత్సరాలు జైలు శిక్ష , 5000/-జరిమాన విధించారు.
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని , శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు.పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ,న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈకేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, అప్పటి డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత డిఎస్పీ నాగేంద్రచారి,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్,గంబిరావుపేట ఎస్.ఐ శ్రీకాంత్,కోర్టు మానిటరిoగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు,కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్,cms కానిస్టేబుల్ నవీన్,పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల లను జిల్లా ఎస్పీ అభినందిచారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >