Posted on 2026-06-09 14:05:48
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహంపై నల్లగొండలో కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడాన్ని తెలుగుదేశం పార్టీ వేములవాడ నియోజకవర్గ అడహాక్ కమిటీ సభ్యులు & టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఇది చాలా బాధాకరం ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి ఇలా చేయడం తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కో లేకపోవడం లాంటి పిరికిపందల చర్యగా మోతె రాజిరెడ్డి వ్యాఖ్యానించారు.తక్షణమే ఈ కుట్రకు పాల్పడిన దుండగులను గుర్తించి క్రిమినల్ చర్యలతో పాటు కఠినంగా శిక్షించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని ఆయన అన్నారు. నల్లగొండలో కొందరు దద్దమ్మల పిరికి చర్యల వలన తెలుగుదేశం పార్టీ భయపడదని చంద్రబాబు నాయుడు లోకేషులను అభివృద్ధిలో ఎదుర్కోలేని పిరికిపందలు చేతకాని దద్దమ్మలు కుట్రలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని ప్రపంచ దేశాలకు తెలుగుజాతి గౌరవాన్ని సాటి చెప్పిన మహనీయుడి విగ్రహానికి నిప్పు పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మోతె రాజిరెడ్డి కోరారు..
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >