Posted on 2024-02-25 19:42:57
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలో నలుగురు మావోయిస్టు దళ సభ్యులను ఆదివారం నాడు చత్తీస్‌ఘడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామంలో మిర్చి కోతకు వచ్చిన చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలలో దళ సభ్యులు ఉన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు గుర్తించారు. సివిల్ డ్రెస్సుల్లో నిఘా ఏర్పాటు చేసి దళ సభ్యులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకొని వాహనంలో దళ సభ్యులను తరలించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన జూలూరుపాడు పోలీసులు వలస కూలీల పలు స్థావరాలకు వెళ్లి విస్తృతంగా సోదాలు చేపట్టారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >