Posted on 2024-09-03 13:48:30
విద్యతోనే సమాజాభివృద్ధి
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ వితరణ
ఎమ్మెల్యే వేతనంతో కళాశాల స్వీపర్, వాచ్ మెన్ లకు ఏడాది జీతాలు
మాజీ ఎమ్మెల్యే "బక్కని నర్సింహులు" చేతుల మీదుగా చెక్కులు, కంప్యూటర్ పంపిణీ
ఎమ్మెల్యే శంకర్ ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే "బక్కని"
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజంలో విద్యతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని విద్య కోసం ఎంత చేసినా తక్కువేనని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన "ఎమ్మెల్యే వేతనం" ద్వారా కళాశాల సిబ్బందికి వేతనాలను 72 వేల రూపాయల చెక్కులను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు చేతుల మీదుగా కళాశాల సిబ్బందికి ఈ చెక్కులతో పాటు ఓ కంప్యూటర్ ను కళాశాల కోసం వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్యాం, కళాశాల ప్రిన్సిపల్ మంజుల సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు మాట్లాడుతూ..
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్కరు మెలిగిన వాడే సమాజం బాగుపడుతుందని సూచించారు. ఎమ్మెల్యే వీళ్ళ పల్లి శంకర్ తన వేతనం ద్వారా కళాశాలకు కంప్యూటర్ మరియు సిబ్బందికి వేతనాలు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ మంజుల, గ్రామ పెద్దలు శ్యామ్ తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, ఎమ్మెల్యే శంకర్లను కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి రాజు మాజీ ఎంపీటీసీ వెంకటేష్ గుప్తా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రేఖల మల్లేష్ బాయ్ బబ్లు షబ్బీర్ కళాశాల ప్రిన్సిపల్ మంజుల లెక్చరర్ ప్రశాంత్ శ్రీశైలంతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నేత రఘు, కుమార్ గౌడ్, చంద్రశేఖర్, సింగారం సుదర్శన్, ముబారక్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >