Posted on 2024-09-03 12:18:25
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బుడమేరు వరద విజయవాడ ప్రజల జీవితాల్లో విషాదాన్ని నింపింది. దాని ఉద్ధృతికి తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. గుణదలలోని విజయనగర్ కాలనీకి చెందిన కొల్లిపర వెంకటేశ్వరరావు(63), ఆయన కుమారుడు సందీప్(35) ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అక్కడికి వెళ్లినవారు సోమవారం ఉదయానికీ ఇంటికి రాలేదు. అనుమానంతో కుటుంబసభ్యులు అక్కడికెళ్లి చూడగా వరద నీటిలో వారిద్దరి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు వచ్చి వారి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఘటనలో గొల్లపూడి నల్లకుంట సెంటర్ వద్ద కాలువలో గుర్తుతెలియని మహిళ (55) మృతదేహం కొట్టుకొస్తుండగా, స్థానికులు గమనించి ఒడ్డుకు తీసుకువచ్చారు.
తెలంగాణలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగులో గల్లంతైన నూనావత్ మోతీలాల్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో తండ్రీకూతురు గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రం బిడ్డ అశ్విని మృతదేహం లభ్యంకాగా, నిన్న తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని రెస్క్యూ టీం వారు గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంకాగా, స్థానికులను కంటతడిపెట్టించింది.
బిడ్డ అశ్వినిని శంషాబాద్ విమానాశ్రయంలో దింపేందుకు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి శివారు గంగారంతండా నుండి నిన్న తెల్లవారుజామున కారును తానే నడుపుతూ ఆనందంగా బయలుదేరాడు మోతిలాల్. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిపైనుంచి ఆకేరు వాగు ఉధృతంగా పోతుండటంతో వరద తీవ్రతను గుర్తించక అలాగే ముందుకెళ్లాడు. దీంతో వారు ప్రయాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోయింది.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >