Posted on 2024-09-10 10:50:23
డైలీ భారత్, పెద్దపల్లి: పెద్దపల్లి మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ (36)కు నాలుగేళ్ల కింద సంధ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు.
సునీల్, సంధ్య మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
అనారోగ్యం కారణంగా సునీల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్లో చనిపోయాడు
దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు మంథనిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు.
విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి మంథనికి చేరుకొని అంత్యక్రియలు అడ్డుకుంది.
సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది.
భర్త మృతిపై పోలీసులను ఆశ్రయించిన భార్య
సునీల్ మృతదేహంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బయలుదేరి సిద్దిపేట వరకు చేరుకున్నాక, అతని భార్య సంధ్య అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మృతిపై అనుమానం ఉందని అత్త తోపాటు బావపై ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సంద్య బావకు పోన్ చేసి శవాన్ని వెంటనే వెనక్కి తీసుకురావాలని ఆదేశించారు.
పోలీసుల ఆదేశంతో శవాన్ని తీసుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతదేహం గురించి పట్టించుకోకుండా సునీల భార్య సంధ్య తన కొడుకుకు న్యాయం చేయాలని పట్టుబట్టింది. స్వగ్రామానికి వెళ్లాక మాట్లాడుకుందామని సర్ది చెప్పి అందరు మంథనికి చేరారు.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >