Posted on 2023-11-10 14:39:03
షాపులు షాపింగ్ మాల్ లలో పనిచేసే గుమస్తాలకు బోనస్ మరియు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముషం రమేష్ మోర అజయ్ డిమాండ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఎగమంటి ఎల్లారెడ్డి గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూశం రమేష్ మోర అజయ్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ డిగ్రీలు ఆ పైన చదివిన అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఉపాధి లేక షాపులు షాపింగ్ మాల్స్ లలో పనిచేస్తుంటే అట్టి యజమానులు వారి నిరుద్యోగాన్ని ఆసరా చేసుకుని కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని అదేవిధంగా ఒక్క మనిషి ఈ రోజులలో ఆటో కైనా బస్సులలోనైనా ప్రయాణం చేసి సిటీకి చేరుకోవాలంటే కనీసం రానుపోను 50 నుండి 100 రూపాయల ఖర్చులు అవుతున్నాయి కానీ యజమానులు మాత్రం 6000 నుండి 9000 వరకు మాత్రమే ఇస్తూ రాత్రి పది గంటల వరకు వారితో శ్రమ చేయించుకుంటూ ఉన్నారు. నెలలో ప్రయాణ ఖర్చులు తీసివేస్తే 3000 నుండి 6000 వరకు మాత్రమే వేతనాలు వారికి అందుతున్నాయి కనీసం పనిచేసే గుమస్తాలకు టి ఏ డి ఏ లు కూడా ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. కనీసం కార్మిక శాఖ అధికారులు కూడా అటువైపుగా చూస్తున్నటువంటి దాఖలాలు లేవు షాపింగ్ మాల్స్ లలో దాదాపు 20 నుండి 30 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కనీసం వారికి పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించకుండా కార్మిక శాఖ అధికారులను పీఎఫ్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ గుమస్తాలకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి అవసరం ఉన్నన్ని రోజులు వాడుకుని వారిని పని నుండి తొలగిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కావున ఇప్పుడు వచ్చిన దీపావళికి వెంటనే ఒక నెల వేతనం బోనస్ గా ఇచ్చి తదుపరి నుండి కనీస వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుమస్తా సోదరి సోదరులు ఒకవేళ ఇవ్వని ఎడల కార్మిక శాఖ అధికారికి ఫిర్యాదు చేయగలరు లేదా జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >