| Daily భారత్
Logo




"గాంధీ" లో మరణాలపై రగడ..

News

Posted on 2024-09-19 11:55:29

Share: Share


"గాంధీ" లో మరణాలపై రగడ..

డైలీ భారత్, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో పసిపిల్లలు, బాలింతల మరణంపై అధికార, ప్రతిపక్షాల మధ్య బుధవారం మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఎక్స్‌లో ఘాటుగా బదులిచ్చారు

ప్రభుత్వ దవాఖాన్లపై కుట్రలు వద్దంటూ మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్‌

 ఈ ఏడాదిలో 48 మంది పసిబిడ్డలు, 14 మంది బాలింత తల్లులు మరణించారని ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆస్పత్రిలో ఇంత విషాదమా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? అని కేటీఆర్‌ "ఎక్స్‌" లో ప్రశ్నించారు. ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే.. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితేంటని, సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. పాలన గాలికి వదిలేసి విగ్రహ రాజకీయాలు చేస్తున్న సీఎంకు ఎవరైనా బాధ్యతను గుర్తు చేయాలని కోరారు.

కేటీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. గాంధీ ఆస్పత్రిపై బురద జల్లి రోగులు రాకుండా చేసి కార్పొరేట్‌ ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చాలని కేటీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. గాంధీ వంటి టెర్షియరీ కేర్‌ ఆస్పత్రులకు అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులే వస్తారని, వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు వైద్యులు ప్రయత్నిస్తారని వివరించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. దేశంలోని ఏ టెర్షియరీ కేర్‌ ఆస్పత్రిలోనైనా ఇలాంటి ఘటనలు ఉంటాయన్నారు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే ఇలా జరిగిందంటూ కేటీఆర్‌ మరణాల సంఖ్యను భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న మరణాల వివరాలను విడుదల చేశారు. కాగా, సినీనటుడు నాగార్జునను సీఎం రేవంత్‌రెడ్డి రూ.400కోట్లు డిమాండ్‌ చేశారని బాల్క సుమన్‌ ఆరోపించారు. ఆ మొత్తం ఇవ్వనందుకే ఎన్‌కన్వెన్షన్‌ కూల్చేశారని విమర్శించారు.

Image 1

స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!

Posted On 2026-04-27 16:39:38

Readmore >
Image 1

తినగ తినగ మునగ మేలు చేయు

Posted On 2026-04-27 14:18:29

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-27 14:12:14

Readmore >
Image 1

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Posted On 2026-04-27 14:10:31

Readmore >
Image 1

పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్

Posted On 2026-04-27 14:09:19

Readmore >
Image 1

ప్రభుత్వ పథకాలు వేగవంతం చేయాలి

Posted On 2026-04-27 14:07:10

Readmore >
Image 1

లేమామిడిలో అంబరాన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-04-27 13:02:36

Readmore >
Image 1

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-27 12:59:21

Readmore >
Image 1

మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం

Posted On 2026-04-27 10:36:06

Readmore >
Image 1

ప్రేమ పేరుతో మోసం… యువతి ఆత్మహత్య

Posted On 2026-04-27 08:03:32

Readmore >