| Daily భారత్
Logo




ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యా?

News

Posted on 2024-09-20 09:32:11

Share: Share


 ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యా?

డైలీ భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని ధులే జిల్లా నుంచి సంచలన సంఘటన జరిగింది. ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ విషయమై పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో శవమై కనిపించారని., వారి మృతదేహాలు కుళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది హత్యా లేక కుటుంబ సభ్యుల ఆత్మహత్యా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అందిన సమచారం ప్రకారం, ఈ కేసులో ఒక అధికారి మాట్లాడుతూ.., ప్రమోద్ నగర్ ప్రాంతంలోని ఒక కాలనీలో జరిగిన ఈ సంఘటన రాత్రి 11 గంటలకు కొంతమంది పొరుగువారు కుటుంబం యొక్క బంగ్లా నుండి భరించలేని వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. బంగ్లాలో ప్రవీణ్ సింగ్ గిరాసే (53), అతని భార్య దీపాంజలి (47), వారి పిల్లలు మితేష్ (18), సోహమ్ (15) మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

దంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రవీణ్ సింగ్ మృతదేహం పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని, అతని భార్య పిల్లలు నేలపై చనిపోయారని అధికారి తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి లేఖ లభించలేదని ఆయన తెలిపారు. ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. గత రెండు రోజులుగా ఇంట్లో ఎలాంటి కదలిక కనిపించలేదని తెలిపారు. ధులేలోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా భార్య, ఇద్దరు పిల్లలు విషపూరితమైన పదార్థాలను సేవించినట్లు తేలిందని అధికారి తెలిపారు. లంకాని గ్రామంలో గిరాసేకు పురుగుమందులు విక్రయించే దుకాణం ఉందని, అతని భార్య టీచర్‌ అని, పిల్లలు చదువుతున్నారని తెలిపారు. అసలు మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు అధికారి తెలిపారు. గిరాసేతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేదా.. ఈ చర్యకు దిగడానికి గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. దేవ్‌పూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >
Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >