Posted on 2024-10-09 13:18:06
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ పిలుపు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ మరియు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని గణేష్ నగర్ నందు కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మనో వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం పని పరిస్థితుల్లో వ్యక్తుల మానసిక ఆరోగ్యం అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే పవర్ లూం కార్మికులకు కౌన్సిలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
వృత్తి పరమైన పరిస్థితులు మానసిక ఆరోగ్యంపై ఏటువంటి ప్రభావం చూపిస్తాయో, వాటి నుండి బయటపడే మార్గాలను గురించి విస్తృత అవగాహన కల్పించేందుకు సంవత్సరం అంతా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిద్ర లేమి, ఎక్కువగా బాధపడటం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు వ్యక్తిని మానసిక సమస్యల వైపు నెట్టేస్తాయని అన్నారు.
అలవాట్లు మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని తెలుపుతు మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని కార్మికులకు సూచించారు.
మద్యపానం, ధూమపానం, తంబాకు నమలడం, అతిగా సెల్ ఫోన్ వాడకం మానుకోవాలని అన్నారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ గత 15 సంవత్సరాలుగా కార్మికుల మానసిక ఆరోగ్యంపై అనేక కౌన్సిలింగ్ లు ఏర్పాటు చేసి మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పాటు నిస్తున్నదని తెలిపారు.
ఏటువంటి మానసిక సమస్య ఎదురైనను సంకోచం లేకుండా మైండ్ కేర్ సెంటర్ ను సంప్రదిస్తే కౌన్సిలింగ్, చికిత్స అందిస్తామని తెలిపారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా మద్యం మానుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ లు ఆలువాల ఈశ్వర్, దర్పల్లి శ్రీనివాస్, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, రాపెళ్ళి లత, బూర శ్రీమతి, కొండ ఉమ మరియు కార్మికులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >