Posted on 2024-10-14 13:19:33
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత
రాత్రి ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు - ఒకరి అరెస్ట్
డైలీ భారత్, హైదరాబాద్:సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకర్ని అరెస్టు చేశారు.
విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలయం వద్దకు వచ్చి సీపీ ఆనంద్‌తో కలిసి గర్భగుడిని పరిశీలించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండింస్తున్నామని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కూడా ఘటనా స్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >