Posted on 2024-10-16 19:58:05
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ల సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యారంగం విధ్వంసానికి గురైందని కెసిఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ ప్రభుత్వం ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని అన్నారు.ఎందుకంటే విద్యారంగానికి సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడమే కాకుండా గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగి డిగ్రీ ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం వద్దనే ఉండడం మూలంగా ఉన్నత చదువులకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు.స్కాలర్షిప్ రాకపోవడంతో రాష్ట్ర లో కొన్ని ఇంటర్,డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేసిన పరిస్థితితో పాటు కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితికి పాలక ప్రభుత్వాలే కల్పించాయని అన్నారు.అంతేకాకుండా రియంబర్స్మెంట్ రాక కళాశాలలు నిర్వహించే పరిస్థితి లేదని అధ్వానంగా మారి నిర్వహణ కష్టతరమైపోయి కళాశాలలు మూసివేసే పరిస్థితికి నెట్టవేయబడ్డారని ఈ క్రమంలోనే ప్రవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ కళాశాలలో నిర్వహణకు కష్టమయిపోయిందని, భవనాల అద్దె బిల్లులు చెల్లించలేక పోతున్నామని మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోవడంలేదని ఆవేదనతో వారు బంద్ కు పిలుపునిచ్చిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ప్రభుత్వానికి ప్రైవేటు విద్యాసంస్థలకు మధ్య ఏర్పడిన రియంబర్స్మెంట్ సమస్య కారణంగా విద్యార్థులు నలిగిపోకుండా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేసి విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నీ హెచ్చరించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >