Posted on 2024-10-16 21:01:11
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి బుదవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా గ్రంథాలయంలోని తన చాంబర్‌లో నియామక పత్రంపై, హాజరు పట్టీలో సంతకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తనను ఈ పదవిలో నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి, సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గ్రంథాలయ సంస్థపై ఇప్పటికీ అవగాహన లేదని, త్వరలో అధికారులు, సిబ్బందితో కలిసి అన్ని వివరాలు తెలుసుకుంటానని తెలిపారు. ఆగిపోయిన నూతన భవన నిర్మాణం, డిజిటల్ లైబ్రరీపై దృష్టిసారిస్తానన్నారు. మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలపై ఫోకస్ పెడతానని పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, వీర్లపల్లి శంకర్,ప్రకాష్ గౌడ్,రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు చైర్మన్ మధుసూదన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు, శాలువాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >