Posted on 2024-10-18 15:37:53
డైలీ భారత్, పెదకాకాని: గుంటూరు జిల్లాలో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకాని వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా చదివిన మహేశ్.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. 10 రోజుల క్రితం యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దసరా సమయంలో శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >