| Daily భారత్
Logo




బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ

News

Posted on 2025-06-09 17:16:49

Share: Share


బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్టు తెలుస్తోంది.

పెరిగిన పాస్ చార్జీలు ప్రకారం.. గతంలో రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్, ఇప్పుడు రూ.1,400కి పెరిగింది. రూ.1,300గా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, ప్రస్తుతం రూ.1,600కి పెరిగింది. అలాగే రూ.1,450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్, ఇప్పుడు రూ.1,800గా అమలులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా గణనీయంగా పెరిగినట్టు అధికారిక సమాచారం.

ఈ పెంపుతో సామాన్య ప్రజానీకానికి రవాణా ఖర్చులు అధికమవుతాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ బస్సుల్లో ప్రయాణించే వారు ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు.

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >