| Daily భారత్
Logo




తెలంగాణకు పట్టిన అవినీతి తెగులును కాంగ్రెస్ పాలన వదిలిస్తుందా?

News

Posted on 2023-12-12 09:03:29

Share: Share


తెలంగాణకు పట్టిన అవినీతి తెగులును కాంగ్రెస్ పాలన వదిలిస్తుందా?

డైలీ భారత్, తెలంగాణ: అమర వీరులు సాధించిన తెలంగాణ దొరల చేతిలో చితికి పోయింది, భూ దొంగల సమూహం అధికారాన్ని చెలాహించింది, నారగోని,ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

MRO ల నుండి కలక్టర్ ల వరకు వందల కోట్లు సంపాదించారు,కార్పొరేటర్ ల నుండి మంత్రుల వరకు 10 కోట్ల నుండి వందల,వేల కోట్లు సంపాదించారు అన్నది కాధన లేని నిజం, ధరణి భూమి ఉన్న వాన్ని లేని వాడిని చేసింది భూమి భూమి లేని వాన్ని ఉన్న వాన్ని చేసింది ప్రభుత్వ భూమిని ప్రవేట్ భూమిని చేసింది ప్రవేట్ భూమిని ప్రభుత్వ భూమిని చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించి భూములను మింగిన సర్పాల నుండి మళ్ళీ భూమిని కక్కించాలి,ప్రస్తుత భూ సమస్యలకు ఒక విధంగా కారణమైన ధరణి పోర్టల్ సాప్ట్ వేర్ నిర్వహిస్తున్న విదేశీ సంస్థ (terracis technology owned by Quantela, USA ) కు కాంట్రాక్ట్ రద్దు చేసి  కేంద్ర ప్రభుత్వ ఐటీ సంస్థ అయిన Nic కు ఇచ్చి,ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సరి దిద్దాలి, ధరణీ వలన తమ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలి, లేఅవుట్లు అయిన భూమికి కూడా పాస్ భుక్కులు ఇచ్చారు రైతు బంధు కూడా ఇస్తున్నారు వాటిని గుర్తించి రద్దు చేయాలి కౌలు రైతులను ఆదుకోవాలి,అసైన్డ్ భూమికి అమ్ముకునే హక్కులు ఇవ్వాలి

గ్రామ పంచాయితీ లేఅవుట్ల లో రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపిన ప్లాట్ల ను సత్వరమే రిజిస్ట్రేషన్ చేయాలి

   BRS ప్రభుత్వం మెమో no.G2/257/2019 dated 26/8/2020 ద్వారా గ్రామపంచాయితీ లేఅవుట్ల లో పస్ట్ డాక్ మెంట్ కానీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేయడం జరిగింది,దీనిపై కొందరు లేఅవుట్ డౌలపర్స్ గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 257 సర్క్ లర్ రిజిస్ట్రేషన్ చట్టానికి విరుద్ధమని గౌరవ హైకోర్టు రద్దు చేసి రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు కొమ్ము కాసిన brs ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకుంది దీని వలన కేవలం HMDA పరిధి లోనే సుమారు రెండు లక్షల ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది, డెవలపర్స్ మరియు డబ్బు చెల్లించిన కొనుగోలు దారులు ఆనాటి నుండి ఆందోళన చెందుతూనే ఉన్నారు వీరందరూ తెలంగాణ వారే

కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టు లో వేసిన SLP no. 19695/202/ను ఉప సహరించు కోవాలి

గత ప్రభుత్వం లో జరిగిన అన్ని స్కీమ్స్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి

    మాజీ CS సోమేష్ కుమార్,అరవింద్ కుమార్, అమెయ్ కుమార్, వెంకట్ రామ్ రెడ్డి, రంజిత్ కుమార్ (పల్కనామ ప్యాలెస్ లో బిడ్డ పెళ్లికి ఒక్కరికీ 12 వేల రూపాయల భోజనం పెట్టించారు రంజిత్ కుమార్) తో సహా ఇతర ఐఏఎస్ ఐ పి యస్ లపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల పై అవినీతి పై తక్షణమే విచారణ జరపాలి, గంతం లో వెలుగు పేపర్ మాజి CS సోమేష్ కుమార్ పై ఉన్న 400 కోర్టు ధిక్కరణ కేసుల ను ఆధారాలతో బయట పెట్టడం జరిగింది కానీ చర్య తీసుకో లేదు, నిజాయితీ పరులైన అధికారుల పేర్లు ప్రకటించాలి

    రిటైర్ అయిన ఐఏఎస్, ఐ పి యస్ లు , ఇంజనీర్లు ఇతర అధికారులు GHMC లో HMDA లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో వివిధ పోస్ట్ లలో ఉన్నారు వారిని తొలగించాలి

చాలా మంది కలెక్టర్ లు ధరణీ రావడం తో కోట్ల రూపాయలు సంపాదించడమే కాక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలలో భాగస్వాములుగా ఉన్నారు

  వీరందరికీ బయం భక్తి ప్రజల మీద న్యాయస్థానాల మీద గౌరవం లేదు, కేవలం రాజకీయ నాయకుల పనులు సక్కబెట్టడానికి మాత్రమే పని చేశారు సామాన్య ప్రజలను పట్టించుకో లేదు

     BRS ప్రభుత్వం కు    తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు ధరణీ సమస్యలు,కౌలు రైతు సమస్యలు,రైతు బంధు సమస్యలు వివిధ G.O లలో ఉన్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకు పోయినా పట్టించు కోలేదు G.O లన్ని గoధరగోళం  G.O 59 లో తమ పార్టీ వారికి నచ్చిన వారికి అతి తక్కువ ధరకు భూమిని రెగ్ల రైజ్ చేశారు వారిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, k, కేశవరావు, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి వారి పేర్లు వినిపించాయి పేద మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుత మార్కెట్ విలువ కన్నా ఎక్కువ ధర తో డిమాండ్ నోటీస్ లు పంపగా చాలా మంది రెగ్ల రైజ్ చేసుకో లేక పోయారు, ఇప్పుడు అధికారం కూలిపోవడానికి ఆ సమస్యలే కారణం అయ్యాయి, మాజి CS, మొదలు కోని చాలా మంది కలెక్టర్ లు అక్రమ సంపాదన చేశారు,మంత్రులు ఎమ్మెల్యే లు అందరు అక్రమ సంపాదన చేసిన వారే అందరి పై విచారణ జరపాలి, వారి పైన తగిన చర్యలు తీసుకోకుంటే ఇప్పుడున్న వారు కూడా అక్రమ సంపాదన కు తెగబడే అవకాశం ఉన్నది,ముఖ్య మంత్రి గా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు  ఇచ్చిన మాట నిల పెట్టుకునేలా ఉన్నాయి

నారగోని,ప్రవీణ్ కుమార్

ప్రెసిడెంట్

తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >