Posted on 2025-06-18 10:34:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం, హరిలాల్ తండా గ్రామానికి చెందిన మాలోత్ అరుణ, అను మహిళను పాత కక్షలు మనసులో పెట్టుకొని అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్ అయినా మాలోత్ విజయకుమార్ మరియు అతని తల్లి మాలోతు గోపి, మరియు అదే గ్రామానికి చెందిన మాలోత్ సంతోష్ అను వ్యక్తులు తేదీ 03.06.2025 నాడు బీరు సీసాతో దాడి చేసి కొట్టారని మరియు గొడవను ఆపడానికి వచ్చిన మాలోత్ నారాయణ, బద్రి, సుశీల లను కూడా కొట్టి గాయపరిచినారని సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా సుజాతనగర్ ఎస్సై యం .రమాదేవి కేసు దర్యాప్తు చేసి మాలోత్ విజయ్ కుమార్ ,మాలోత్ సంతోష్. మాలోతు గోపీలను అరెస్టు చేసి కొత్తగూడెంలోని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగింది.
ఈ కేసులో ముద్దాయి అయినా మాలోత్ విజయ్ కుమార్ గతంలో కూడా పలు కొట్లాట కేసులలో ముద్దాయిగా ఉన్నందున అతని మీద రౌడీషీట్ సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఉంది. కాబట్టి సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు మరియు సస్పెక్ట్ షీటర్లు ఎవరైనా ఏదైనా కొట్లాటలు, గొడవలు చేసినట్లయితే చట్టపరమైన చర్య తీసుకోబడును. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >