| Daily భారత్
Logo




రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

News

Posted on 2025-07-05 12:32:43

Share: Share


రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అతి వేగం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. కారు వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడుకకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి కుమారుడితో పాటు చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, శంభాల్ జిల్లా, హర్ గోవింద్‌పూర్‌కు చెందిన సురాజ్‌కు కొన్ని నెలల క్రితం సిర్తోల్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం అయింది.

శనివారం పెళ్లి కూతురి ఇంటి దగ్గర పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. పెళ్లి కోసం సురాజ్ కుటుంబసభ్యులు పది మంది బొలెరో కారులో సిర్తోల్ బయలుదేరారు. కారులోని వారు జోకులు వేసుకుంటూ.. నవ్వుతూ, తుళ్లుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తాయని వారికి తెలీదు పాపం. కారు అతి వేగంగా ముందుకు దూసుకెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే జవానాయ్ గ్రామం దగ్గర కారు అదుపు తప్పింది. జనతా ఇంటర్ కాలేజీ గోడను బలంగా ఢీకొట్టింది.

ఆ వెంటనే కారు తిరిగి పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారిని స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు ప్రమాదానికి గురైన 10 మందిని.. సురాజ్, ఆశ, ఐశ్వర్య, విష్ణు, మనోజ్, కోమల్, గణేష్, మధు,సచిన్, రవిలుగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఒకే కుటుంబానికి చెందిన 8 మంది చనిపోవటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >